బాలీవుడ్ లో ఒకప్పుడు మెయిన్ హీరోయిన్ గా నటించిన హ్యూమా ఖురేషి ఈమధ్య కాలం నుండి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. రీసెంట్ గా ఈమె సౌత్ లో రజినీకాంత్ కి జోడిగా 'కాలా' సినిమాలో నటించింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ కావడంతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది.
నటన పరంగా గ్లామర్ పరంగా ఆమె మంచి మార్కులు కొట్టేసింది. ఫలితంగా తెలుగు దర్శక నిర్మాతల దృష్టి హ్యూమా ఖురేషిపై పడింది. తమ సినిమాల్లో ఆమెని తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు 'సైరా' సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఒక కీలకమైన పాత్ర కోసం హ్యూమా ఖురేషిని సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. 'సైరా' సినిమాలో నరసింహారెడ్డికి మొదటి భార్యగా నయనతార నటిస్తుండగా రెండో భార్యగా హ్యుమా ఖురేషీని తీసుకున్నట్టుగా టాక్. త్వరలోనే ఆమె షూటింగ్ లో జాయిన్ కానుందని అంటున్నారు. వచ్చే సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.