Advertisementt

చరణ్ 80కి తీసికెళ్తే.. ప్రభాస్ 70 అంటున్నాడు!

Tue 26th Jun 2018 08:21 PM
prabhas,saaho,radha krishna,next movie,1970 movie  చరణ్ 80కి తీసికెళ్తే.. ప్రభాస్ 70 అంటున్నాడు!
Charan 80’s, Prabhas To 70’s చరణ్ 80కి తీసికెళ్తే.. ప్రభాస్ 70 అంటున్నాడు!
Advertisement
Ads by CJ

దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమాని 1980 బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించాడు. ఆనాటి కాలాన్ని అద్భుతంగా తెరకెక్కించినప్పటికీ.. ప్రేక్షకులు రంగస్థలాన్ని సూపర్ హిట్ చేశారు. సుకుమార్ కూడా 1980 ల నాటి మనుషులు ఎలా వుంటారు... అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని... అప్పటి వాతావరణాన్ని సృష్టించాడు సుకుమార్. అప్పటి వాతావరణాన్ని సుకుమార్ ప్రెజెంట్ చేసిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమాలో నటించిన రామ్ చరణ్, సమంత, అనసూయ, ఆది, జగపతిబాబు.. అప్పట్లో పల్లెటూరి మనుషుల బట్టలు, మేకప్ అన్నీ ఎలా ఉండేవో అలాంటి వాటిని ధరించడం... గోదావరి యాస అన్నీ సినిమాని విజయం వైపు తీసుకెళ్లాయి. అయితే ఇప్పుడు రంగస్థలం సినిమాని ప్రేక్షకులు సూపర్ హిట్ చెయ్యడంతో.. చాలామంది దర్శకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే శర్వానంద్ - హను రాఘవపూడి సినిమా కూడా పల్లెటూరి, 1990 బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా 1970  అంటున్నాడు. అతనెవరో కాదు బాహుబలి తో ప్రపంచాన్ని చుట్టేసి... సాహో తో ఇండియా వైజ్ గా పాపులర్ అవుతున్న ప్రభాస్ సాహో తర్వాత చెయ్యబోయే రాధాకృష్ణ ఫిలిం కూడా 1970  బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతుందని ఫిలింనగర్ టాక్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎక్కువగా విదేశాల్లో తెరకెక్కుతోందని... ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యం  తెలిసిన కుర్రాడిలా కనబడతాడనే ప్రచారము ఉంది. ఇక ప్రభాస్ హీరోయిన్ కోసం అడవులు, కొండలు ఎక్కుతాడనే ప్రచారము ఉంది. మరి రాధాకృష్ణ 1970 కి సంబందించిన కాలాన్ని ఎలా సృష్టిస్తాడో అనే ఆసక్తి ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాదు.. సాధారణ ప్రేక్షకుల్లోనూ ఉంది.

అయితే రాధాకృష్ణ ప్రభాస్ సినిమా కోసం ఇప్పటికే 1970  కాలం నాటి ట్రైన్స్, షిప్స్ వంటి వాటిని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. సాహో సినిమాని హాలీవుడ్ రేంజ్ లో చేస్తున్న ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్యూర్ లవ్ స్టోరీగా...  అలనాటి కాలంలో ప్రేమికుల మధ్య జరిగి ఉండే బాండింగ్ తో ఉంటుందట. మరి ఈ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

Charan 80’s, Prabhas To 70’s:

Prabhas-Radha Krishna film to have 1970s backdrop

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ