Advertisementt

'అర్జున్‌రెడ్డి'కి షాక్ ఇచ్చిన కేటీఆర్‌!

Tue 26th Jun 2018 08:09 PM
vijay devarakonda,lunch treat,ktr,plastic,arjun reddy,filmfare award,surprise  'అర్జున్‌రెడ్డి'కి షాక్ ఇచ్చిన కేటీఆర్‌!
KTR Surprise Visit To Vijay Devarakonda's House 'అర్జున్‌రెడ్డి'కి షాక్ ఇచ్చిన కేటీఆర్‌!
Advertisement
Ads by CJ

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కి.. 'అర్జున్‌రెడ్డి' హీరో విజయ్‌దేవరకొండ బంధువు అన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కేటీఆర్‌ 'అర్జున్‌రెడ్డి' విడుదల, ఆ తర్వాత ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌ కావడంపై విజయ్‌ని ప్రమోట్‌ చేస్తూ ఆయన మీద ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ఇక ఇటీవల విజయ్‌ దేవరకొండకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు లభించగా, దానిని వేలం వేసి వచ్చిన డబ్బులను తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళంగా ఇస్తానని విజయ్‌ ప్రకటించడం, ఈ సందర్భంగా అవార్డు అందుకున్న విజయ్‌ని కేటీఆర్‌ అభినందించడమే కాదు... ఆయన వేలం ద్వారా ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఇస్తానని చెప్పడంపై హర్షం వ్యక్తం చేసి, ఎలా చేద్దాం? అనే విషయాన్ని తర్వాత మాట్లాడుకుందామని తెలిపాడు. 

ఇక తాజాగా కేటీఆర్‌ విజయదేవరకొండ ఇంటికి వెళ్లి కాసేపు గడిపి వచ్చాడు. తమ ఇంటికి అతిథిగా వచ్చిన కేటీఆర్‌తో దిగిన ఫొటోలను విజయ్‌దేవరకొండ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. 'అసలు ఏమి జరుగుతోంది బాసూ!' అంటూ ఆశ్చర్యపోయాడు. ఇక కేటీఆర్‌ తమ ఇంటికి వచ్చిన సందర్భంగా ఆయన తనకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించాడని, చేనేత కార్మికులు, వస్త్రాలు, నీటి నిర్వహణ, హైదరాబాద్‌ రోడ్లపై గతుకులు, గుంటలు, నీటి నిర్వహణ, హైదరాబాద్‌ చరిత్ర, తన తండ్రి, కుమారుడి గురించిన పలు విషయాల గురించి కేటీఆర్‌ మాట్లాడారని విజయ్‌ తెలిపాడు. 

ఇక తెలంగాణను ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిపేందుకు కేటీఆర్‌,.. విజయ్‌ 'ప్లాస్టిక్‌ వాడటం ఆపు' అని అంటూ కేటీఆర్‌ తనకి సిటీని చూపించిన ఫొటోను పోస్ట్‌ చేశాడు. మీకు ఇష్టమైన నాయకుడు మీఇంటికి లంచ్‌కి వచ్చినప్పుడు ఒక్క నిమిషం..... ఏమి జరుగుతోంది బాసూ...నిజానికి ఏమైనా జరగవచ్చు. ఏది నచ్చితే అది చేస్తుంటాం.. అంటూ విజయ్‌దేవరకొండ ఇక్కడ కూడా తనదైన యాటిట్యూడ్‌ చూపించాడు. 

KTR Surprise Visit To Vijay Devarakonda's House:

Vijay Devarakonda's Lunch Treat For KTR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ