Advertisementt

సంక్రాంతికి కాదు.. మహేష్ రూటు మార్చాడు!

Tue 26th Jun 2018 04:45 PM
mahesh babu,25 film,ugadi,sankranthi  సంక్రాంతికి కాదు.. మహేష్ రూటు మార్చాడు!
MB25: It's Ugadi Not Sankranthi సంక్రాంతికి కాదు.. మహేష్ రూటు మార్చాడు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి సినిమాతో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25వ చిత్రం కాబట్టి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'డెహ్రాడూన్' లో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు కొన్ని ప్రధానమైన పాత్రల కాంబినేషన్లలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ టైంలోనే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ అనుకుని దాని ప్రకారమే షెడ్యూల్ వేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా బాలయ్య - క్రిష్ కాంబినేషన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలానే బోయపాటి - చరణ్ మూవీతో పాటు అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానున్నాయి.

ఇవి కాకుండా రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఆ సమయంలో రిలీజ్ పెట్టుకుంటే థియేటర్ల సమస్య వస్తుందని .. షూటింగు విషయంలోను టెన్షన్ పడవలసి వస్తుందని దర్శక నిర్మాతలతో పాటు మహేష్ బాబు భావించాడట. అందుకే ఈ సినిమాకు సంక్రాంతికి కాకుండా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ లోనే 'పోకిరి'.. 'భరత్ అనే నేను' సినిమాలు రిలీజ్ సూపర్ హిట్ కావడంతో ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాను కూడా ఏప్రిల్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందని మహేష్ ఆలోచనట.

MB25: It's Ugadi Not Sankranthi :

Mahesh Babu 25th film release date set Archives

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ