ఎవరికైనా ప్రతిభ నిరూపించుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలి. మొదట్లోనే సంచలనాలు సృష్టించే వారు సరైన పునాది లేకపోతే అంతే త్వరగా కనుమరుగు కూడా అవుతారు. బిగ్‌బాస్ సీజన్1లో కూడా ప్రారంభంలో ఎన్టీఆర్ తడబడ్డాడు. కానీ ఆ తర్వాత తన స్థాయి ఏమిటో నిరూపించాడు. ఇప్పుడు నాని కూడా మొదటి రెండు వారాలకంటే మూడో వారంలో అద్భుతంగా పుంజుకుని షోని రక్తికట్టిస్తున్నాడు. మూడో వారంలో నాని తాజాగా ఎంటరై.. ఓ రాజు.. ఏడుగురు పిల్లలు అంటూ పిట్టకథతో మొదలుపెట్టి తనదైనశైలిలో వ్యవహరించాడు. 'ఏమైనా జరగవచ్చు.. ఇంకాస్త మసాలా' అంటూ ఈ షోకి ఇచ్చిన ట్యాగ్‌లైన్లకు నాని మూడో వారంలోనే న్యాయం చేశాడు.
ఆయన పార్టిసిపెంట్‌లో ఒకరైన కిరీటీ దామరాజు మీద ఫైర్ అయ్యాడు. తోటి కంటెంస్టెంట్ కౌశల్ పట్ల ఆయన వ్యవహరించిన తీరుని ఎండగట్టాడు. టాస్క్‌లో భాగంగా చేతులు కట్టేసిన కౌశల్‌ని నిమ్మకాయలతో ఇబ్బంది పెట్టిన విధానం, మాటలతో రెచ్చగొట్టడం, అమ్మాయిల తరపున వకాల్తా పుచ్చుకుని కౌశల్‌ని ఇబ్బంది పెట్టిన తీరు వంటి వాటిని ఎత్తి చూపిన నాని ఇది మగతనం అనిపించుకుంటుందా? అని కిరీటీ దామరాజుని ప్రశ్నించారు. ప్రేక్షకులు, పార్టిసిపెంట్స్ కూడా ఆయన వ్యవహార తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెబుతూ, కిరిటీ దామరాజుకి సంబంధించిన పలు వీడియోలను చూపించాడు. దీనికి కిరిటీ తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుంటానని బిగ్‌బాస్‌కి మాట ఇచ్చాడు.
మరోవైపు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొందరు పార్టిసిపెంట్స్ వ్యవహరిస్తున్నారని కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తొలిరోజు నుంచే కొందరు ఓ గ్రూప్‌లా మారి తనను బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారని, టాస్క్‌లో భాగంగా తాను చేసిన దానిని పదేపదే తప్పు పడుతున్నారని ఆయన తెలిపాడు. తోటి హౌస్‌మేట్స్ కనీసం మానవత్వం కూడా చూపించడం లేదని, ఒకరేమో నిమ్మరసం, మరోకరు పసుపు, మరొకరేమో అమ్మాయిలను ఇబ్బంది పెట్టినట్లు మాట్లాడారని, ఆ సమయంలో తనని చూసి నాన్నకు ఏమైంది అని తన పిల్లలు ప్రశ్నిస్తే తన భార్య వారికి ఏం సమాధానం చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు జైల్‌కార్డ్ విషయంలో తనని తప్పుపడుతున్నారని, ఎవరు నిజాయితీగా కనిపించకపోవడం వల్లే జైలుకార్డుని ఎవ్వరికీ ఇవ్వలేదని, ఎవరికి ఇవ్వాలనేది తన నిర్ణయంకాదని, ఇక్కడంతా కపట ప్రేమని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ ఎపిసోడ్‌లో కౌశిక్, తనీష్‌ల మద్య విభేదాలు మరింతగా పెరిగినట్లు కనిపించింది. దాదాపు కొట్టుకున్నంత పని చేసిన వారు తమ వైఖరిని మార్చుకోలేదు. ఇక 'బిగ్‌బాస్'పై నిప్పులు చెరిగిన బాబుగోగినేనిని నాని మెచ్చుకున్నాడు. పార్టిసిపెంట్స్‌కి గాయాలు అవుతుంటే బిగ్‌బాస్ నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని బాబుగోగినేని ప్రశ్నించారు. దీనిపై బాబుగోగినేనిని ప్రశంసించిన నాని ఇకపై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపాడు.