Advertisementt

రెండే రెండు సినిమాలు రాత మార్చేశాయి!

Tue 26th Jun 2018 12:09 AM
vijay devarakonda,busy actor,tollywood,geetha govindham,nota,dear comrade,taxiwaala  రెండే రెండు సినిమాలు రాత మార్చేశాయి!
Vijay Devarakonda Turns Busy Actor in Tollywood రెండే రెండు సినిమాలు రాత మార్చేశాయి!
Advertisement
Ads by CJ

గత ఏడాది విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతనికి వరసగా రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ రావడంతో అతని ఇమేజ్ పెరిగిపోయింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అతని నుండి ఒక డైరెక్ట్ సినిమా కూడా రాలేదు. ఈ రెండు సినిమాల తర్వాత అతను నటించిన 'ఏ మంత్రం వేసావే' వచ్చింది. అయితే ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియదు. ఇక ఆ తర్వాత వచ్చిన 'మహానటి' సినిమాలో చిన్న రోల్ చేశాడు. అయితే అది అతనికి డైరెక్ట్ సినిమా కాదు.

అలాంటిది ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలతో దండయాత్ర చేయబోతున్నాడు. ఆ సినిమాలన్నీ మనోడి రేంజ్ కి తగ్గట్టుగానే యూత్ ఫుల్ గా తెరకెక్కుతున్నాయి. ముందుగా 'టాక్సీ వాలా' అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ బొనాంజాని స్టార్ట్ చేయనున్నాడు. ఇది హార్రర్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఇది ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత విజయ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో మన్నల్ని అలరించడానికి వస్తున్నాడు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం'. ఈ సినిమా దాదాపు కంప్లీట్ అయ్యిపోయింది. ఈ సినిమా 'టాక్సీ వాలా' కి ముందో తర్వాతో వచ్చే అవకాశం ఉంది. ఇక 'డియర్ కామ్రేడ్' అనే డిఫరెంట్ జోనర్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక 'నోటా' అంటూ ఓటు గుర్తుకు సంబంధించిన విషయాన్ని సినిమా ద్వారా చెప్పాలని అనుకుంటున్నాడు. ఇవి కాకుండా క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేయలేదు. మొత్తానికి ఈ ఐదు డిఫరెంట్ సినిమాలతో భలే సెట్ చేసుకున్నాడు విజయ్. కేవలం రెండే రెండు సినిమాలతో మనోడి రాతే మారిపోయింది. చూద్దాం విజయ్ ఏ స్థాయిలో విజయాల్ని అందుకుంటాడో.

Vijay Devarakonda Turns Busy Actor in Tollywood:

Vijay Devarakonda Busy with Numbers Of Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ