టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఎదగాలంటే ఒకటి పెద్ద ఫ్యామిలీ నుండి రావాలి లేదా నిర్మాతల కొడుకులుగా రావాలి. సినీ ఇండస్ట్రీలో బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బులతో కొడుకుల మీద నమ్మకంతో పెట్టి భారీ స్థాయిలో ప్రయోగాలు చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే కొంతమంది నిర్మాతల కొడుకులు వచ్చి వారికంటు ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నారు.
బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ అదే విధంగా వచ్చి మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అదే స్టయిల్లో మరో నిర్మాత కొడుకు వస్తున్నాడు. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోస్ తో సినిమాలు చేసిన బడా ప్రొడ్యూసర్ డివివి.దానయ్య కొడుకుని కూడా హీరోగా ఎంట్రీ ఇప్పించడానికి సాన పెడుతున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా డైరెక్టర్ తేజ చెప్పిన లైన్ తో ఇంప్రెస్స్ అయిన డివివి.దానయ్య ఆ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం తేజ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక డివివి.దానయ్య కొడుకు ఇప్పటికే డ్యాన్సులతో పాటు నటన కూడా నేర్చుకుంటున్నట్టు టాక్. అయితే ఈ అప్ కమింగ్ కు మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ కాజల్ తో చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం కాజల్ కి దానయ్య ఓ ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ కుర్రాడి పక్కన కాస్త సీనియర్ గా కనిపించే కాజల్ ఏం బాగుంటుంది గురూ అంటూ ఇప్పటికే పంచులు పడుతున్నా కూడా. ప్రస్తుతం డివివి.దానయ్య రామ్ చరణ్ - బోయపాటి సినిమాలతో పాటు రాజమౌళి తెరకెక్కించే మల్టీ స్టారర్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక తేజ ఈ సినిమా స్క్రిప్ట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నారు.