ఆమధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాబోయే కాలంలో తమ సామాజిక వర్గం మరింతగా బలపడాలంటే తమ కులానికి చెందిన అందరు జనాభా పెంచడంపై దృష్టి పెట్టి, తమ సామాజిక వర్గం జనాభా సంఖ్య పెరిగేలా చేయాలని పిలుపునిచ్చాడు. ఇది నాడు ఎంతటి దుమారాన్ని రేపిందో అర్ధమవుతోంది. ఇక కొన్నాళ్ల కిందట టిడిపి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ శ్రీవారు శ్రీవేంకటేశ్వరస్వామి గురించి మాట్లాడుతూ, వెంకన్న అనాల్సింది పోయి వెంకన్న చౌదరి అని సంబోధించాడు. ఈ వ్యాఖ్యలు ఏదో ఏమరుపాటుతో పొరపాటున మాట్లాడి ఉండవచ్చని చెప్పాలి.
కానీ వారి సామాజిక వర్గంపై వారికున్న గజ్జి, కుల పిచ్చి వంటివి అన్యాపదేశంలో వారి నోటి నుంచి బయటికి వచ్చేలా చేశాయనేది వాస్తవం. ఇది జరిగిన ఇంత కాలం తర్వాత తాను తిరుమల శ్రీవేంకటశ్వేరస్వామిని వెంకన్న అనబోయి, వెంకన్న చౌదరి అని అనడం పట్ల రాజమండ్రి ఎంపీ, ప్రముఖ రియల్‌ఎస్టేట్ వ్యాపారి, సినీ నటుడు మురళీమోహన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. జరిగిన తప్పుని క్షమించాలని ఆ తిరుపతి వెంకన్నను కోరుతున్నానని తెలిపాడు. పొరపాటు జరిగింది.. మన్నించు స్వామీ అని వేడుకున్నానన్నారు. ఇక ఈయన వైసీపీ ఎంపీల రాజీనామాలపై స్పందిస్తూ, రాజీనామాల పేరుతో వైసీపీ డ్రామాలాడుతోందని, ఉప ఎన్నికలంటే వైసీపీకి భయం ఏర్పడిందని అన్నారు. రాజీనామాలు చేసిన తర్వాత 75రోజులకు అవి ఆమోదం పొందడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపితో వైసీపీ చీకటి ఒప్పందం చేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజాగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శనం చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయినా తిరుమలపై రాజకీయాలు మాట్లాడకూడదని రోజాకి నీతులు చెప్పే ఈ తెలుగు తమ్ముళ్లు తాము మాత్రం రాజకీయాల గురించి ఎలా మాట్లాడుతారనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.