Advertisementt

రెండూ సంక్రాంతికే అంటే ఎలా దిల్ రాజు?

Mon 25th Jun 2018 03:34 PM
dil raju,sankranthi sentiment,mahesh babu,vamsi paidipally,f2 movie  రెండూ సంక్రాంతికే అంటే ఎలా దిల్ రాజు?
Sankranthi Sentiment: Dil Raju in Confusion రెండూ సంక్రాంతికే అంటే ఎలా దిల్ రాజు?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ సినిమాల్తో పాటుగా.. మీడియం రేంజ్ సినిమాలు కూడా ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన లవర్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుండగా... నితిన్ - రాశి ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్రీనివాస కళ్యాణం ఈ ఆగష్టు లో విడుదలకు సిద్దమవుతుంది. ఇక మహేష్ - వంశి పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కి దిల్ రాజు వన్ అఫ్ ది ప్రొడ్యూసర్. అశ్వినీదత్, పివిపి తో కలిసి మహేష్ సినిమాని నిర్మిస్తున్నాడు. అలాగే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ ని ప్రారంభించాడు. తాజాగా ఓపెనింగ్ జరుపుకున్న ఎఫ్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది.

వెంకటేష్, వరుణ్ తేజ్ లు తోడల్లుళ్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్న ఈ మూవీని అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్టైనర్ గా  తెరకెక్కిస్తున్నాడు. తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ లో రంగమ్మత్త అనసూయ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈ చిత్రం ఓపెనింగ్ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని త్వరితగతిన షూటింగ్ కానిచ్చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా తెలిపాడు. అయితే ఇక్కడే ఏదో తేడా కొడుతోంది. అంటే దిల్ రాజు సంక్రాంతి సెంటిమెంట్ మాములుగా రాలేదు. సంక్రాంతికి తన సినిమాల్తో హిట్ కొట్టడం అంటే దిల్ రాజుకి సరదా.

అయితే మహేష్ - వంశి పైడిపల్లి సినిమాని కూడా వచ్చే సంక్రాంతికే విడుదల చేస్తారనే ప్రచారం ఎప్పటినుండో ఉంది. మరి దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఎఫ్ 2, మహేష్ - వంశీల సినిమా కూడా సంక్రాంతికే పోటీపడడం అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయం. తన సినిమాలనే పోటీకి దించే సాహసం దిల్ రాజు చెయ్యడు. కానీ ఇప్పుడు దిల్ రాజు స్వయంగా ఎఫ్ 2 సంక్రాంతికే అన్నాడు. అలాగే మహేష్ - వంశీల సినిమా కూడా సంక్రాంతికే అని అంటున్నారు. మరి దిల్ రాజు డెసిషన్ ఎలా ఉంటుందో కానీ.. ఖచ్చితంగా మహేష్ మాత్రం సంక్రాంతికే వస్తాడని అంటున్నారు.

Sankranthi Sentiment: Dil Raju in Confusion :

Clashes between F2 and Mahesh-Vamsi Paidipally Movie