టాలీవుడ్ లోనే కాదు ఏ భాషలోనైనా ఒకసారి కమెడియన్ అవతారమెత్తాక... దానిలోనే కంటిన్యూ అయితే.. ఓకే గాని... ఒక్కసారి హీరోగా అవకాశమొచ్చింది ప్రూవ్ చేసుకుందాం అని కామెడీ పాత్రలని వదిలేసి హీరో అవతారమెత్తితే.. ఆఖరుకి రెండింటికి చెడ్డ రేవడి అవుతుందనేది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. గతంలో బ్రహ్మికి అలీ వంటివారికి హీరో వేషలొచ్చినా.. లక్కుని పరీక్షించుకుని మల్లీ కమెడియన్స్ గానే కంటిన్యూ అయ్యారు. అయితే అప్పటిలో కమెడియన్స్ కి గట్టి పోటీ లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి కామెడీని నెగ్లెట్ చేస్తే ఆ ప్లేస్ లోకి అనేకమంది కమెడిన్స్ దూరిపోతున్నారు.
ఇప్పుడు ఉదాహరణకి సునీల్ నే తీసుకుందాం. ఒకసారి హీరో అయ్యి సక్సెస్ అందుకున్నాక.. ఇక హీరోగానే ఫిక్స్ అవుదామనుకున్నాడు. కానీ ప్రేక్షకులు సునీల్ ని హీరోగా ఇప్పుడు యాక్సెప్ట్ చెయ్యడం లేదు. అలాగే సప్తగిరి కూడా అంతే. హీరో అవకాశం వచ్చింది హీరోగా మిగిలిపోదామనుకున్నాడు. కానీ సప్తగిరి సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. అలాగే శ్రీనివాస్ రెడ్డి కూడా అంతే.. ఆనందో బ్రహ్మ, గీతాంజలి సినిమాల్లో కథే హీరో అయినా.. శ్రీనివాస్ రెడ్డి హీరోగా కనిపించాడు. తాజాగా జంబలకడిపంబ తో చేతులు కాలాయి. ఇక జబర్దస్త్ నుండి కమెడియన్ గా ఎంటర్ అయిన షకలక శంకర్ రే వున్నాడు.
సరే హీరోలుగా వర్కౌట్ కాక.. మళ్ళీ కమెడియన్స్ గా అవుదామనుకుంటే .. సరైన అవకాశాలు ఉండడం లేదు. ఎందుకంటే జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ నుండి అనేకమంది కమెడియన్స్ కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. ఇక సీనియర్ కమెడియన్స్ కి సరైన ప్లేస్... స్టార్ హీరోస్ మూవీస్ లో దొరకడం లేదు. మరి కలిసి రాదని తెలిసిన తమ ట్రైల్స్ తాము వేస్తూనే ఉంటున్నారు. ఆశ ఉండడం నేరం కాదు.. కానీ వెనుదిరిగి కెరీర్ చూసుకుంటే బావుంటుంది అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకడిపంబ సినిమాల్తో వరుసగా ఫెయిల్ అయిన శ్రీనివాస్ రెడ్డి కాస్త ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బావుంటుంది అంటున్నారు. మరో పక్క సునీల్ మళ్ళీ కమెడియన్ అవతారమెత్తుతున్నాడు. అది కూడా స్టార్ హీరో సినిమాతో. మరి కమెడియన్ గా సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా వుండబోతుందో.. మిగతా కమెడియన్స్ డీప్ గా వాచ్ చేస్తే బావుంటుంది.