టాలీవుడ్‌లో మొన్న డ్రగ్స్ స్కాం, తర్వాత శ్రీరెడ్డి కాస్టింగ్‌కౌచ్ వివాదం, మద్యలో పవన్ అభిమానులు, కత్తిమహేష్, పూనమ్ కౌర్ వంటి వారి వ్యాఖ్యలు బాగా కాకరేపుతున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ పరువు ఇప్పుడు ఏకంగా అమెరికా సాక్షిగా, చికాగో వేదికగా మంటకలిసింది. ఈ వ్యవహారంలో బయటికి వస్తున్న పేర్లు, లీక్‌లలో వినిపిస్తున్న వారి లిస్ట్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఈ వ్యవహారంలో అసల ఆ సెక్స్‌స్కాండల్‌కి దిగిన దంపతులు ఎవరు? ఏయే చిత్రాలకు వారు పనిచేశారు? ఎన్నిసార్లు అమెరికాలో ఈవెంట్ల పేరుతో ఎవరెవరిని అక్కడికి రప్పించుకున్నారు? అనే విషయాలపై ఒక్కసారిగా సినీ పెద్దలు, మీడియా 'మా' పరువు తీస్తోందని గోల పెట్టేవారు దృష్టి సారిస్తే ఎన్నో సంచలన విషయాలు బయటికి రావడం ఖాయం.
కానీ మాకేమీ సంబంధం లేదు. మీడియానే ఆరోపణ చేస్తోంది. ఇది మీడియా తప్పు అని పరనింద ఆపి, అసలు సమస్య మూలాలలోకి వెళ్లడంపై ఎందుకు మా అసోసియేషన్ నుంచి ఇతర సినీ పెద్దలు కూడా మౌనంగా ఉన్నారనేది అర్ధం కావడం లేదు. సొంత ఇల్లు బాగుచేసుకోకుండా, తమ పరిధిలోని విషయాలపై అయినా వీరు నిజాయితీగా స్పందించాల్సివుంది. అందరు శాఖాహారులే అయితే అసలు పీతలు ఏమయ్యాయనేది ప్రశ్న. అలాగని మాంసం తిన్నాం కదా అని ఎముకలను మెడలో వేసుకోమని ఎవ్వరూ చెప్పరు. కానీ ప్రతి విషయాన్ని మీడియా రాద్దాంతం పేరుతో సమస్యను పక్కదారి పట్టించడం సరికాదు. ఇక ఈ లిస్ట్‌లో తాజాగా లీక్ వీరులు తెలుగు హీరోయిన్ మాధవీలత పేరును కూడా పెట్టారు. దీనిపై ఆమె మండిపడుతూ, మహాకవి శ్రీశ్రీ కవితలను ఎంతో తెలివిగా తన వాదనకు వాడుకుంది. నాకేం సంబంధం లేదు అనే ఒక్కమాటతో తేలిపోయే దానికి ఇలా ఉపన్యాసాలు ఇస్తూ పోవడం వల్ల ఒరిగేదేమీ లేదని తెలుసుకోవాలి. మాధవీలత తన ఫేస్ బుక్ లో ఈ విధంగా శ్రీశ్రీ కవితలతో ఎదురుదాడికి దిగింది.
‘‘ఇది కేవలం సంస్కారం లేని వాళ్ళకి మాత్రమే :-
వినేవన్నీ నిజాలు కావు బయటకి వచ్చేవి అన్నీ న్యాయం కాదు ....
ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన సోమరులు మీరు
చావండీ
ఆడవాళ్ల అత్మనీ చంపి..
ఆ శవమ్ మీద చిల్లరేరుకునే ముఖాలూ..
మనసే లేని మృగాలు మలినమైన అంతరాత్మలు మీరు.
ఫేస్ బుక్‌లోనూ,
యూట్యూబ్‌లోనూ
తెగ బలిసిన కుక్కల వాగుడుకి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ప్రతి వాడి చుట్టూ తిరిగి నేను మంచిదాన్ని అని సర్టిఫికేట్ తెచ్చుకోను.
అక్కర్లేదు... అన్నిచోట్లా అన్నీ ఉంటాయి.
వేటిని ఆపడం సాధ్యం కాదు.
తెలిసిన మన పని మనం చేసుకుని బురదలో నేనెందుకు పడటం అని జాగ్రత్తగా వెళిపోవడం తప్ప.
ఆపడానికి నేను సీఎం కాదు పీఎం కాదు జస్ట్ ఏ కామన్ గర్ల్...
ఇప్పుడు నా ఫేస్‌బుక్‌లో నన్ను బూతులు తిడుతున్న చెత్త నా డ్యాష్ గాళ్లకి
సమాధానం చెప్పే అవసరం నాకు లేదు.
నువ్ వచ్చావా???
నువ్ చూశావా???
నువ్ ఉన్నావా???
వీటికి దమ్ముంటే ఆన్సర్ ఇవ్వండి.
సో కథలు విని అదే నిజం అనుకుంటే నేను కథలు చాలా చెప్తాను...
చదువుకున్నారు.. నీ బతుకు ఏంటి.. నీ అవసరం ఏంటి.. నీ జాబ్ ఏంటి.. నీ ఫ్యామిలీ ఏంటి..
అని చూసుకుంటే మన దేశం ఇలా సంకనాకి పోదేమో పాపం....
నన్ను కామెంట్స్ ఎవరెవరు అయితే చేస్తారో.. చేయండి పర్వాలేదు.
ఎవడికి నేను ఆన్సర్ చెప్పను నాకు అవసరం లేదు...
నా నిజాయితీ ఇది అని ప్రూవ్ చేసుకునే కర్మ నాకు పట్టలేదు. అలా పడితే ఇంక నా లైఫ్ ఎండ్.
కావునా ఇలాంటి గాసిప్స్‌ని నేనసలు లెక్కచేయను. చెడ్డ పేరు గురించి పట్టించుకోను.
ఎందుకంటే నాకు తెలుసు నేను ఏంటో.
కేవలం నా జీవీతం గురించి జాగ్రత్త తీసుకుంటాను.
నేను ఓ పొలిటికల్ పార్టీలో ఉన్నాను.. కానీ మీకు ఎలాంటి ప్రమాణాలు చేయలేదు.
కాబట్టి నన్ను ప్రశ్నించడానికి మీకు ఎలాంటి హక్కు లేదు.
నా బాధ్యతగా ఏం చేయాలో అది చేస్తున్నా..
నేను ఈ దేశంలోనే బెస్ట్ సిటిజన్ కాగలననే నమ్మకం ఉంది.
నేను ప్రమాణం చేసిన రోజున అడగండి.
ఇప్పటికి మీ ఎమ్మెల్యేని అడుక్కోండి..
ఏం పీకావురా మా ఏరియాకి అని, అప్పుడు బాగుపడుతుంది దేశం’’