Advertisementt

సూపర్‌స్టార్‌తో అల్లుఅరవింద్‌.. నిజమేనా?

Mon 25th Jun 2018 12:31 PM
mahesh babu,allu aravind,geetha arts,super star,mahesh babu movies  సూపర్‌స్టార్‌తో అల్లుఅరవింద్‌.. నిజమేనా?
Mahesh Babu and Allu Aravind: Any Possiblity? సూపర్‌స్టార్‌తో అల్లుఅరవింద్‌.. నిజమేనా?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా నిర్మాతగా అల్లుఅరవింద్‌కి, ఆయన బేనర్‌ గీతాఆర్ట్స్‌కి ఎంతో పేరుంది. దేశంలోనే మొదటి 100కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం ఈయన బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌తో నిర్మించిన 'గజిని'నే కావడం విశేషం. ఇక అల్లుఅరవింద్‌ తెలుగులో మాత్రం భారీ బడ్జెట్‌ చిత్రాలను కేవలం మెగా హీరోలతోనే చేస్తూ ఉంటాడు. మీడియం రేంజ్‌ చిత్రాలను మాత్రం ఇతర హీరోలతో కూడా కానిస్తుంటాడు. అలాంటి ఘన చరిత్ర కలిగిన అల్లుఅరవింద్‌ గీతాఆర్ట్స్‌ బేనర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం చేయనున్నాడనే విషయం ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

ఇటీవల అల్లుఅరవింద్‌, మహేష్‌లు కలిసినప్పుడు దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అల్లుఅరవింద్‌ అడగటంలో మహేష్‌ కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. ఇదే నిజమైతే మెగా హీరోలతో కాకుండా బయటి సూపర్‌స్టార్‌తో అల్లుఅరవింద్‌ చేయబోయే భారీ బడ్జెట్‌ చిత్రం ఇదే అవుతుంది. ఇక ప్రస్తుతం మహేష్‌బాబు దిల్‌రాజు, అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత యూనిట్‌ అమెరికా వెళ్లనుంది. 

ఇది మహేష్‌కి 25వ ప్రతిష్టాత్మక చిత్రం కావడం విశేషం. ఇక మహేష్‌ 26వ చిత్రంగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా ఖరారైంది. ఇక ఈయన ప్రస్తుతం 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, ఇంద్రగంటి మోహనకృష్ణలతో చిత్రాలు చేయడానికి ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరో ఒకరి చిత్రాన్ని అల్లుఅరవింద్‌ ప్రొడ్యూస్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Mahesh Babu and Allu Aravind: Any Possiblity?:

>Mahesh Babu and Allu Aravind's Combo Soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ