Advertisementt

నాగ్, నానిల చిత్రం ఆ తరహా చిత్రమట!

Sat 23rd Jun 2018 06:13 PM
nagarjuna,nani,multistarrer,gangster,doctor  నాగ్, నానిల చిత్రం ఆ తరహా చిత్రమట!
Nagarjuna Turns Gangster And Nani, A Doctor నాగ్, నానిల చిత్రం ఆ తరహా చిత్రమట!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లోమల్టీస్టారర్‌గా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మాతగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం పలు చిత్రాలకు స్ఫూర్తి అని వచ్చిన వార్తలను దర్శకుడు ఇప్పటికే ఖండించాడు. ఇక ఈ మూవీ బాలీవుడ్‌లో రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వం వహించే సున్నితమైన భావోద్వేగాలు, అంతర్లీనంగా మెసేజ్‌, గిలిగింతలు పెట్టే కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాలను తాకే ఎమోషన్స్‌తో రూపొందుతోంది. ఇందులో నాగార్జున డాన్‌గా, నాని ఆయనకు వైద్యం చేసే డాక్టర్‌గా కనిపించనుండటంతో మొదట అందరు ఇది యాక్షన్‌ అంశాలతో సాగుతుందని భావించారు. 

కానీ ఇది నవరసాల సమ్మేళనంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నాగ్‌ సరసన ఆకాంక్ష సింగ్‌, నాని సరసన రష్మికమండన్నా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి తాజాగా నాగ్‌ మాట్లాడుతూ, ఇది చాలా సరదాగా సాగిపోయే స్క్రిప్ట్‌. రాజ్‌కుమార్‌ హిరాణి తరహా చిత్రంలా ఉంటుంది. శ్రీరామ్‌ ఆదిత్య ప్రత్యేకత ఇందులో కనిపిస్తుంది. మల్టీస్టారర్స్‌ చేయడం వల్ల, ఇతర హీరోల వల్ల ఆ కెరీర్‌ డోలాయమానంలో పడుతుందని నేనెప్పడు ఫీల్‌ కాను. మొదట్లో ఎక్కువగా సోలో చిత్రాలు వచ్చాయి. 'ఊపిరి'లో కార్తితో చేయడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఇప్పుడు నానితో చేస్తుంటే కూడా ఎంతో సరదాగా ఉంది. 

ఇక ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఓ సాహస చిత్రంలో నాగార్జున చేస్తున్నారనే వార్తలకు కూడా ఆయన సమాధానం ఇచ్చాడు. ప్రియదర్శన్‌ని కలిశాను. కానీ స్క్రిప్ట్‌ వినలేదు. జూన్‌ చివర్లో పూర్తి స్క్రిప్ట్‌ వింటాను. ప్రస్తుతం నానితో చేస్తున్న చిత్రంపైనే దృష్టి పెట్టాను. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల నేనేమీ అలసటకు గురవ్వడం లేదు. ప్రతి పాత్రా, ప్రతి సినిమా నాకో సవాల్‌. గతంలో చేయని చిత్రాలను, పాత్రలను ఎంతో చాలెంజింగ్‌గా తీసుకుంటాను అని చెప్పుకొచ్చాడు నాగార్జున. 

Nagarjuna Turns Gangster And Nani, A Doctor:

Nagarjuna teams up with Nani for a Munnabhai-style gangster comedy film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ