Advertisementt

‘ఆయుష్మాన్ భవ’లో పెద్దరికం కనబడుతోంది!

Sat 23rd Jun 2018 01:31 PM
charan tej,ayushman bhava,teaser,paruchuri vekateswara rao  ‘ఆయుష్మాన్ భవ’లో పెద్దరికం కనబడుతోంది!
Ayushman Bhava Teaser Released ‘ఆయుష్మాన్ భవ’లో పెద్దరికం కనబడుతోంది!
Advertisement
Ads by CJ

ఈమధ్యకాలంలో హీరోలుగా నటించిన వారు కొత్తవారైనా సరే సినిమాలో కంటెంట్‌ ఉంటే హీరో కొత్త వాడా? కాదా? అనేది కూడా చూడకుండా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. నాటి 'ఐతే', చిత్రం నుంచి నిన్నమొన్నటి 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి'వరకు ఇలా వచ్చి మంచి విజయం సాధించిన చిత్రాలే కావడం విశేషం. ఇక ప్రస్తుతం అందరు కొత్తవారితో 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ 'ఈ నగరానికి ఏమైంది' అనే చిత్రం తీస్తున్నాడు.

ఇక విషయానికి వస్తే తాజాగా విడుదలైన ఓ చిత్రం టీజర్‌ ఇప్పుడు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. చరణ్‌తేజ్‌ హీరోగా స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో 'ఆయుష్మాన్‌భవ'. చిత్రం రూపొందుతోంది. తాజాగా దీని టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో వస్తున్న 'రగిలే నీ రుధిరం' అంటూ సాగే సాంగ్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంది. రెండు కులాలు, మతాల మధ్య జరిగే ప్రేమ, పెళ్లి వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని దీని టీజర్‌ని చూస్తే అర్ధమవుతోంది. 

ఇక ఈ చిత్రానికి మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, పరుచూరిబ్రదర్స్‌ స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, 'సినిమా చూపిస్త మావా, నేనులోకల్‌' వంటి చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ అందిస్తుండటం విశేషం. నవంబర్‌ 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు టీజర్‌లో తెలుపగా మీట్‌బ్రోస్‌ పాటలను, భీమ్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ని అందిస్తుండటం విశేషంగా చెప్పాలి.

Click Her For Teaser:

Ayushman Bhava Teaser Released:

Charan Tej Ayushman Bhava Teaser Releases on Paruchuri Venkateswara Rao Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ