Advertisementt

వొడా, ఎయిర్‌టెల్ కు మెగా హీరో క్లాస్!

Sat 23rd Jun 2018 01:22 PM
allu sirish,tollywood,vodafone,airtel,network,social media  వొడా, ఎయిర్‌టెల్ కు మెగా హీరో క్లాస్!
Allu Sirish Is Fed Off With Vodafone Network వొడా, ఎయిర్‌టెల్ కు మెగా హీరో క్లాస్!
Advertisement
Ads by CJ

సెలబ్రిటీలు పలు సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఇది వారి వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. అయితే ఓ సెలబ్రిటీ ఏకంగా ఓ సంస్థ నెట్‌ వర్క్‌ బాగుంటుందని, మరో నెట్‌ వర్క్‌ బాగుండదని పేరు పెట్టి మరీ తిట్టడం, పొగడటం వంటివి ఆయా సంస్థల క్రెడిబులిటీని దెబ్బతీస్తాయి. లేదా పెంచుతాయి. ఇక విషయానికి వస్తే తాజాగా అల్లు శిరీష్‌ వోడాఫోన్‌ సంస్థను పేరు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా దుమ్మెత్తిపోశాడు. అదే సమయంలో ఎయిర్‌టెల్‌కి లభ్ది చేకూరేలా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆయా కంపెనీ పేర్ల ప్రస్తావన లేకుండా చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అల్లుశిరీష్‌ మాత్రం వోడా పోన్‌ నెట్‌వర్క్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. 

ఇటీవలే ఎయిర్‌టెల్‌లో ఉన్న తాను నెంబర్‌ పోర్టబులిటీ ద్వారా వోడాఫోన్‌కి మారానని, కానీ వోడాఫోన్‌ నెట్‌వర్క్‌ మహా చెత్తగా ఉందని ఆయన తిట్టిపోశాడు. వోడాఫోన్‌కి సిగ్నల్స్‌ అందడం లేదని, నేను ఓ చెత్త నెట్‌ వర్క్‌ని ఆశ్రయించాను. దేని విలువైనా అది నీ దగ్గర ఉన్నంతకాలం తెలియదు. ఈమధ్యే ఎయిర్‌టెల్‌ నుంచి వోడాఫోన్‌కి మారాను. నా పరిస్థితి బ్యాడ్‌ నుంచి వరస్ట్‌గా మారిపోయింది. 4జీ గురించి మర్చిపోండి. 2జీ కూడా సరిగా పనిచేయడం లేదు. కాల్‌డ్రాప్స్‌ సంగతి పక్కనపెట్టండి. కనీసం సిగ్నల్‌ కూడా అందని పరిస్థితి. ఓ పాఠం నేర్చుకున్నాను అని ట్వీట్‌ చేశాడు. 

ఇలాంటి సంఘటన బహుశా ఎవరికీ ఎదురయి ఉండదు. ఎందుకంటే అల్లుశిరీష్‌ బాగా లేదని తిడుతున్న వోడాఫోన్‌ వారే తమ వాణిజ్యప్రకటనలో నటించమంటే కోట్లు తీసుకుని ఎగిరి గంతేస్తారు. కానీ అదే సమయంలో ఓ సెలబ్రిటీ అయి మరి ఎయిర్‌టెల్‌కి లబ్ది చేకూరేలా, వోడాఫోన్‌కి చెడు చేసేలా ఓ సెలబ్రిటీ ఇంత ఓపెన్‌గా ఫైర్‌ కావడం పట్ల భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఓ పౌరుడిగా తన బాధ చెప్పుకునే హక్కు ఆయనకుందని అంటుంటే. కొందరు ఓ సెలబ్రిటీ అయి ఉండి ఇలా ఓపెన్‌గా తన అసహనాన్ని వ్యక్తం చేయరాదని అంటున్నారు. మరి ఈ విషయంపై వోడా ఫోన్‌ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో అనేది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Allu Sirish Is Fed Off With Vodafone Network:

Tollywood Hero Fire on Vodafone Network suggests Airtel as Best Network

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ