Advertisementt

కీర్తి.. తెలుగుకి నో చెప్పడానికి కారణమిదే!

Sat 23rd Jun 2018 01:08 PM
keerthi suresh,telugu movies,kollywood,star heroes,mahanati  కీర్తి.. తెలుగుకి నో చెప్పడానికి కారణమిదే!
Reason Behind Keerthy Suresh Reject Telugu Offers కీర్తి.. తెలుగుకి నో చెప్పడానికి కారణమిదే!
Advertisement
Ads by CJ

'అజ్ఞాతవాసి' తర్వాత అమ్మడు కీర్తి సురేష్ కి అవకాశాలు రావనే అన్నారు అందరూ. పాపం అజ్ఞాతవాసి టైం లోనే కమిట్ అయిన మహానటి వలన కీర్తి సురేష్ కి ఆ సినిమా విజయం బాగా కలిసొచ్చింది. మహానటి మూవీతో కీర్తి సురేష్ నటనను పొగిడిన వారే కానీ పొగడని వారు లేరు. సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ సూట్ అయినట్లుగా మరెవరు సూట్ కారని.. ప్లాప్స్ లో ఉన్నప్పుడు తిట్టిన నోళ్లే.. మహానటి మూవీ చూసాక పొగడ్తలతో ముంచేశారు. అయితే మహానటి విజయంతో కీర్తి సురేష్ కి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. అజ్ఞాతవాసి టైం లో మహానటి కోసం బరువు పెరిగిన కీర్తి సురేష్.. మహానటి విడుదలయ్యాక బరువు తగ్గడం కోసం వ్యాయామాలు చేస్తుంది.

మహానటితో తెలుగు తమిళంలో కీర్తి సురేష్ కి భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే కీర్తి సురేష్ ఇంతవరకు ఒక్క తెలుగు అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కీర్తి సురేష్ కనబడుతుంది. కీర్తి సురేష్ కి అవకాశాలు రాకా.. లేదంటే తెలుగంటే ఇంట్రస్ట్ లేక తెలుగు సినిమాలకు సైన్ చెయ్యడం లేదా? తమిళ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తుందా? అనే అనుమానం అందరిలో మొదలైంది. ప్రస్తుతం తమిళంలో కీర్తి సురేష్ స్టార్ హీరోస్ విజయ్, విశాల్, విక్రమ్ సరసన వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంది. అయితే తెలుగు సినిమాల్లో అమ్మడుకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నప్పటికీ.. తనకి డేట్స్ ఖాళీ లేవని పంపేస్తుందట.

అందుకే కీర్తికి తెలుగులో చెయ్యడం ఇష్టం లేదనే ప్రచారం మొదలైంది. ఆమె వరసగా తమిళంలోనే కమిట్ అవడం.. తెలుగు సినిమాలను రిజెక్ట్ చేయడం చూసిన ఎవ్వరైనా కీర్తి టాలీవుడ్ లైట్ తీసుకుందనిపిస్తుంది. అయితే కీర్తి కి టాలీవుడ్ అంటే చిన్న చూపెమ్ లేదట. కేవలం ఆమె వరుసగా కమిట్ అయిన సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం వలన డేట్స్ సర్దుబాటు చెయ్యలేకే టాలీవుడ్ సినిమాల్లో నటించడం లేదట. విజయ్, విశాల్, విక్రమ్ సినిమాలు కూడా మహానటి ముందు కమిట్ అయినవేనట. ఈ మూడు ప్రాజెక్ట్స్ కారణంగానే కీర్తి ప్రస్తుతం తెలుగు సినిమాలు ఒప్పుకోవడం లేదని కీర్తి సన్నిహితులు చెబుతున్న మాట. అదండీ విషయం కీర్తి తెలుగుకి దూరమవుతుందనుకున్నవారికి వారి సన్నిహితుల సమాధానం.

Reason Behind Keerthy Suresh Reject Telugu Offers:

Keerthy Suresh Busy with Tamil Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ