Advertisementt

మాస్ కోసం మనసు మార్చుకున్న మెగాహీరో!

Sat 23rd Jun 2018 12:18 PM
  మాస్ కోసం మనసు మార్చుకున్న మెగాహీరో!
Varun Tej Mind Set Changed for Mass Image మాస్ కోసం మనసు మార్చుకున్న మెగాహీరో!
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రతీ సినిమాతో ఏదో ఒక వైవిధ్యత చూపిస్తూనే వచ్చాడు. కంచె సినిమాతో తొలి సక్సెస్ అందుకుని.. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుని మీడియం రేంజ్ సినిమాలకి బెంచ్ మార్క్ గా సెట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమతో యూత్ తోనే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు.

అయితే తన మొదటి సినిమా నుండి వరుణ్ తేజ్ క్లాస్ సినిమాలకే పరిమితం అవ్వడంతో మెగా పెద్దల నుంచి ఈ మధ్యనే జ్ఞానోదయం అయ్యేలా క్లాసు ఒకటి పడిందట. క్లాస్ ఇమేజ్ ని పెంచుకోవడం అనే మాట మంచిదే అయినా.. మాస్ ఫ్యాన్స్ ను పట్టించుకోకపోవడం మాత్రం.. అస్సలు సరికాదని చెప్పుకొచ్చారట. క్లాస్ సినిమాలే కాకుండా మాస్ సినిమాలు కూడా చేస్తే బెటర్ అని సూచించారట మెగా పెద్దలు.

దాంతో ఆయన ఇప్పుడు చేసే అంతరిక్షం కాన్సెప్ట్ సినిమా తర్వాత ఓ మాస్ సినిమా చేయాలనీ అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే తన దగ్గరకు వచ్చే డైరెక్టర్స్ కి.. రైటర్స్ కి తనకు సూట్ అయ్యే విధంగా ఓ ఊరమాస్ కథ చెప్పాలని అడుగుతున్నాడట వరుణ్ తేజ్. పోకిరి తరహాలో ఉండేటట్టు ఏమైనా కథ ఉంటే చెప్పమంటున్నాడట. మరి వరుణ్ తేజ్ కి మాస్ స్టోరీ ఇచ్చి మెప్పించే ఆ డైరెక్టర్ ఎవరో చూడాలి!

Varun Tej Mind Set Changed for Mass Image:

Varun Tej Wants A Mass Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ