Advertisementt

అర్జున్ రెడ్డిని అంత మాట అనేసిందేంటి?

Fri 22nd Jun 2018 07:45 PM
vijay devarakonda,rashmika,geetha govindham movie,chating  అర్జున్ రెడ్డిని అంత మాట అనేసిందేంటి?
Interesting Chating Between Vijay Devarakonda and Rashmika అర్జున్ రెడ్డిని అంత మాట అనేసిందేంటి?
Advertisement
Ads by CJ

తాజాగా అర్జున్‌రెడ్డిగా అదరగొట్టిన విజయ్‌దేవరకొండ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ వంటి వారిని కాదని ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ అవార్డును వేలం పెట్టి ఆ మొత్తాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఇస్తానని తెలిపాడు. ఇక విజయ్‌దేవరకొండ మాటల్లో ఎంతో యాటిట్యూడ్‌ కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో తాను కూడా తగ్గేది లేదని, కన్నడ కిర్రాక్‌ పార్టీ ద్వారా సంచలనాలు క్రియేట్‌ చేసి, తెలుగులో 'ఛలో'తో అడుగుపెట్టిన రష్మిక మండన్న కూడా నిరూపించుకుంది. 

ఇక విషయానికి వస్తే విజయ్‌దేవరకొండ, రష్మికా మండన్న ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌బేనర్‌లో ఓ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. వినగానే వీరి జంట తెరపైఎంత అందంగా ఉంటుందోనన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. తాజాగా రష్మిక మండన్న తన సహనటుడు, విజయ్‌దేవరకొండ అవార్డు గెలుచుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్‌ చేస్తూ 'శుభాకాంక్షలు గోవింద' అని ట్వీట్‌ చేసింది. దీనికి విజయ్‌ స్పందిస్తూ 'మేడం..గీతా మేడమ్‌..మీతో సమయం గడపడం నాకు నిజమైన అవార్డు మేడం. ఈ అవార్డులు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి' అని రిప్లై ఇచ్చాడు. దీంతో రష్మిక స్పందిస్తూ 'ఇగో గోవిందం. ఈ ఓవర్‌యాక్షనే తగ్గించుకోమనేది. అసలు నీకు కాదు. ప్రభాస్‌కో, తారక్‌కో ఈ అవార్డు ఇచ్చి ఉంటే మాకు ఈ గోల లేకుండా పోయేది' అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది. దానికి విజయ్‌ బదులిస్తూ 'అవార్డుల్లో ఏం ఉంది మేడం.. మీలాంటి వాళ్లు నన్ను ప్రేమించడం చాలు. గీతం మేడమ్‌' అని ట్వీట్‌ చేశాడు.

'నాలాంటి వాళ్లా? వాళ్లా ఏంటి? ఆ బహువచనం ఏమిటి? తెలుసులే నీగురించి. ఒకరు సరిపోరు. ఎవరిని వదలవుగా' అని రష్మిక అంది. 'మేడం నా ఉద్దేశం అది కాదు మేడం. ఒక్కసారి నన్ను 23వ తేదీ కలవండి మేడమ్‌. అన్ని వివరిస్తా'అని ఏడిపించాడు.ఇక వీరి సంభాషణను బట్టి ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండపేరు గోవింద అని, రష్మిక పేరు గీత అని తెలిసిపోతోంది. ఈ చిత్ర టైటిల్‌ 'గీతాగోవిందం' అని మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఇదంతా 'గీతాగోవిందం' కోసం చేసిన చాటింగ్ అని తర్వాత నెటిజన్స్ కి అర్ధమయింది. 

Interesting Chating Between Vijay Devarakonda and Rashmika:

Vijay Devarakonda and Rashmika Promotes Geetha Govindham Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ