Advertisementt

తేజు, అనుపమల మధ్య టీజింగ్ ట్వీట్లు!

Fri 22nd Jun 2018 07:03 PM
sai dharam tej,anupama parameswaran,tweet,tej i love you  తేజు, అనుపమల మధ్య టీజింగ్ ట్వీట్లు!
Sai Dharam Tej and Anupama Promos 'Tej I Love You' తేజు, అనుపమల మధ్య టీజింగ్ ట్వీట్లు!
Advertisement
Ads by CJ

వరుసగా ఐదు డిజాస్టర్స్‌తో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ బాగా ఇబ్బందులు పడుతున్నాడు. మరోవైపు ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌ కూడా 'ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌' ల తర్వాత బాగా దూరమయ్యాడు. ఇక కరుణాకరన్‌ చిత్రాల విషయంలో ఓ స్పెషాలిటీ ఉంటుంది. ఆయన చిత్రాలలోని హీరోయిన్ల ఇంట్రడక్షన్‌ సీన్స్‌ దృశ్య మనోహరంగా ఉంటాయి. హీరోయిన్లు ఎక్కువగా తెల్లదుస్తుల్లో ఇంట్రడక్షన్‌ సీన్‌లో దేవతల్లా కనిపిస్తూ ఉంటారు. 

ఇక ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్‌, అనుపమపరమేశ్వరన్‌, కరుణాకరన్‌, సీనియర్‌ నిర్మాత కె.యస్‌.రామారావు క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో 'తేజ్ ఐ లవ్‌యు' చిత్రం రూపొందుతోంది. జులై 6వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంపై ఇంకా మంచి బజ్‌ ఏర్పడలేదు. దీంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్ల వేగాన్ని బాగా పెంచి వీడియో ప్రోమోలను విడుదల చేస్తూ ఉంది. ఇందులో భాగంగా 'నా చుట్టు ఉన్నదే' అనే ప్రోమోను విడుదల చేశారు. సాధారణంగా హీరోయిన్లని హీరోలు టీజ్‌ చేస్తూ వచ్చే సాంగ్స్‌ చాలా చిత్రాలలో ఉన్నాయి. దీనిలో మాత్రం దానికి భిన్నంగా హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ సాయిధరమ్‌తేజ్‌ని టీజ్‌ చేస్తున్నట్లుగా ఉంది. 

దీని గురించి తేజు ట్విట్టర్‌లో మాట్లాడుతూ, హీరోయిన్‌ అనుపమ తనని టీజ్‌ చేస్తూ సాగేలా ఇందులో ఉంటుందని తెలిపాడు. దానికి అనుపమా పరమేశ్వరన్‌ సమాధానం ఇస్తూ, నేను అలా చేయను. ఐయామ్‌ఏ గుడ్‌గర్ల్‌ అని రిప్లై ఇచ్చింది. దానికి సాయిధరమ్‌తేజ్‌ నిజమే.. నీవు టీజ్‌ చేయలేదు.. టార్చర్‌ చేశాడు... అని కొంటెగా ఇచ్చిన రిప్లై, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ బాగా వైరల్‌ అవుతోంది. ఏది ఏమైనా టీమ్‌కి కావాల్సింది ప్రమోషన్‌. అది ఏరూపంలో వచ్చినా ఫర్వాలేదు కదా...! అన్నదే అసలు పాయింట్‌. 

Sai Dharam Tej and Anupama Promos 'Tej I Love You':

Sai Dharam Tej says Anupama Parameswaran will tease him in a song for 'Tej I Love You'

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ