Advertisementt

సుధీర్‌తో పెళ్లి అన్న నెటిజన్‌పై రష్మీ ఫైర్!

Fri 22nd Jun 2018 05:41 PM
anchor rashmi,marriage,sudheer,social media,fires  సుధీర్‌తో పెళ్లి అన్న నెటిజన్‌పై రష్మీ ఫైర్!
Anchor Rashmi Gautam Fires On Netizen సుధీర్‌తో పెళ్లి అన్న నెటిజన్‌పై రష్మీ ఫైర్!
Advertisement
Ads by CJ

ఆన్‌ స్క్రీన్‌ మీద చేసే రొమాన్స్‌ కొన్నిసార్లు ఎంతగా కాదని చెప్పినా మరలా మరలా ఇద్దరి మధ్య ఎఫైర్లు ముడిపెట్టేలా చేస్తుంది. 'బిల్లా, మిర్చి, బాహుబలి' తర్వాత ప్రభాస్‌, అనుష్కలు ఎంతగా కాదని నెత్తినోరు బాదుకున్నా కూడా వారి మధ్య లింకులు పెట్టడం మాత్రం ఎవ్వరూ మానడం లేదు. ఇక ప్రభాస్‌, అనుష్క ఫ్యాన్స్‌ అయితే మరో మెట్టు పైకెక్కి మీ ఇద్దరి జంట ఎంతో బాగుంటుంది. మీరు పెళ్లి చేసుకుంటే మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉంటారని అంటూ ఉన్నారు. ఎన్నిసార్లు ప్రభాస్‌, అనుష్కలు దీనిని ఖండించినా దీనికి అడ్డుకట్ట పడటం లేదు. అలా ఏమీ జరగకుండానే ఎఫైర్లు వచ్చే రోజుల్లో బుల్లితెరపై రేష్మి, సుడిగాలి సుధీర్‌లు మాత్రం ఇద్దరికీ ఏదో ఉంది అనే అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి విషయంలో ప్రేక్షకుల్లో గాసిప్స్‌ వస్తున్నాయంటే దానికి వారు తెరపై కనిపించి, డైలాగ్స్‌, చేసే స్కిట్స్‌లో అనుమానాలు వచ్చేలా చేయడమే కారణమని చెప్పాలి. 

ఇక వీరిద్దరు కూడా తమ మధ్య ఏమీ లేదని, తమ స్నేహితులు కావాలని అలా వండివారుస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా రేష్మి ట్విట్టర్‌లో అభిమానులతో చాట్‌ చేసే సందర్భంలో ఓ నెటిజన్‌ 'మీరు సుధీర్‌ని పెళ్లి చేసుకోండి.. మీ జంట బాగుంటుంది. ఇద్దరు మీ కెరీర్లలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు' అని ఉచిత సలహా ఇచ్చాడు. ఎన్నిసార్లు ఖండించినా ఇదే మాటలు వస్తూ ఉండటంతో రేష్మికి బాగా కోపం వచ్చింది. ఆమె వెంటనే ఆ నెటిజన్‌కి చీవాట్లు పెట్టింది. 

మేమిద్దం మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని మీరెలా నిర్ణయిస్తారు? కేవలం స్క్రీన్‌ మీద చూసి డిసైడ్‌ చేస్తారా? రీల్‌లైఫ్‌ని, రియల్‌లైఫ్‌ని వేరు చేసి చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రేక్షకులను అలరించడం కోసమే మేము అలా చేస్తాం. అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీ సలహాలు అసలు అవసరం లేదని గట్టిగానే క్లాస్‌ పీకింది. మరి ఇప్పటికైనా వారిద్దరి మధ్య ఏమీ లేదని అందరు నమ్మితే అదే పదివేలు....! 

Anchor Rashmi Gautam Fires On Netizen:

Anchor Rashmi Responds On Her Marriage With Sudheer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ