బిజెపి వాజ్‌పేయ్‌చేతుల్లో ఉన్నంతకాలం హిందు మతం కూడా హద్దులోనే ఉంది. హిందువులు ముస్లింలు, క్రిస్టియన్లను మైనార్టీల పేరుతో పెద్ద పీట వేయడాన్ని నిరసించారే గానీ దేశం మొత్తం హిందు మయం అయిపోవాలని నాడు భావించలేదు. అన్ని మతాలతో సమానంగా హిందుమతానికి కూడా గౌరవం, మర్యాదలు కల్పించాలని నాటి బిజెపి నేతలు చెప్పేవారు. ప్రజలు కూడా మెజార్టీ పేరుతో తమను అణగదొక్కి, మైనార్టీల పేరుతో ఇతర మతాలను నెత్తిమీద పెట్టుకునే ధోరణిని మాత్రమే నిరసించారు. కాబట్టే వాజ్‌పేయ్ వంటి నాయకుడి చేతిలో ఉన్నంతకాలం హిందు మతం పరమత సహనంతో స్వేచ్చగా వర్ధిల్లింది.
కానీ మోదీ వచ్చిన తర్వాత మాత్రం హిందువుల్లోని కొందరిలో ఉన్మాదం తలకెక్కుతోంది. అన్ని మతాలను సమానంగా చూడాలని మాత్రమే భావించే సాధారణ హిందు మతవాది నేడు ఉగ్రవాదిగా మారుతూ, భారతదేశాన్ని ఏకంగా హిందు మతం ఏకచ్చత్రాధిపత్యం వహించాలని భావిస్తున్నారు. దీనికి ఇటీవల బెంగుళూరులో జరిగిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్ దారుణ హత్య ఓ ఉదాహరణ. తాజాగా ఈ హత్యతో సంబంధం ఉన్న షార్ప్ షూటర్ పరుశురామ్ వాగ్మేరే పోలీసులకు దొరికిన సంగతి తెలిసిందే. ఈ కీలక నిందుతుడు తమ హిట్‌లిస్ట్‌లో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ఉన్నట్లు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాకట, మహారాష్ట్రలకు చెందిన హిందు వ్యతిరేకులైన 60మంది హిట్ లిస్ట్ తమ వద్ద ఉన్నట్లు అతను పోలీసుల విచారణలో తెలిపాడు.
సిట్ ముందు ఆయన ఈ విషయం ఒప్పుకున్నట్లు సమాచారం. హిందు మతాన్ని ఏమైనా అంటే తాము ఊరుకోబోమని ఆ కీలక నిందితుడు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ జాబితా బయటకు రావడంతో ఈ లిస్ట్‌లో ఉన్న అందరికీ భద్రత పెంచాలని సంబంధిత అధికారులకు సిట్ లేఖలు రాసింది. దీంతో నిడుమామిడి మఠం శ్రీవీరభద్రచెన్నమల్ల స్వామి, నటుడు గిరీష్‌కర్నాడ్, సాహితీవేత్తలు కె.ఎస్.భగవాన్, నరేంద్రనాయక్‌లతో పాటు ప్రకాష్‌రాజ్‌కి కూడా భారీ భద్రత కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.