బాహుబలి తో ప్రపంచాన్ని చుట్టేసిన ప్రభాస్ మళ్ళీ అదే తరహాలో సాహో సినిమాని చేస్తున్నాడు. ఒక చిన్న దర్శకుడు సుజిత్ ని నమ్మి అతి పెద్ద సాహో ప్రాజెక్ట్ బాధ్యతలను అతని మీద పెట్టారు ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ అయిన యువి క్రియేషన్స్ వారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సాహో గురించిన ఏ న్యూస్ అయినా నిమిషాల్లో మీడియాలో స్ప్రెడ్ అయ్యిపోతుంది. భారీ ప్రాజెక్ట్ లో అన్ని భారీ విశేషాలే. దుబాయ్ లో ఎనిమిది నిమిషాల ఎపిసోడ్ కి 75 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక ఎప్పుడూ మీడియాతో ఇంటరాక్ట్ కానీ ప్రభాస్ తరుచు నేషనల్ మీడియాలో సాహో ఇంటర్వూస్ ఇచ్చేస్తున్నాడు. అలాగే సాహో సినిమా విశేషాలను బాగానే చెప్పుకొస్తున్నాడు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ సాహో తర్వాత ఏం చెయ్యబోతున్నారు అని అడగగా.... ఆ ప్రశ్నకి ప్రభాస్ షాకింగ్ జవాబు ఇచ్చాడు. సాహో సినిమా తర్వాత ఏం చేస్తానో నాకు పూర్తిగా ఎలాంటి క్లారిటీ లేదు. సాహో తర్వాత సినిమాలే చేస్తానో.. వ్యాపారం చేస్తానో.. లేదా వ్యవసాయం చేస్తానో అనేది క్లారిటీ లేదు. అలాగే అటు వ్యాపారము, ఇటు వ్యవసాయం రెండు చేస్తానేమో చెప్పలేను అంటూ షాకింగ్ సమాధానాలిచ్చాడు బాహుబలి ప్రభాస్. బాహుబలి సినిమా అంతటి విజయాన్ని సాహో కూడా సొంతం చేసుకుంటుందని... బాహుబలి నచ్చిన అందరికి సాహో కూడా నచ్చుతుందని చెబుతున్నాడు.
హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న సాహో సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఈ సినిమాలో శ్రద్ధా కేరెక్టర్ చాలా బలంగా వుంటుందట. ఈ విషయాన్నీ ప్రభాస్ స్వయంగా చెబుతున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కేరెక్టర్ చాలా కీలకమని... సినిమాలోశ్రద్ధా కేరెక్టర్ తోనే సినిమా మొదలవుతుందని..సినిమా నడిచే కొద్దీ ఆమె పాత్ర బలపడుతూ ఉంటుందని చెప్పిన ప్రభాస్.. శ్రద్ధా హిందీ లో డైలాగ్స్ చెప్పేటప్పుడు రెండు మూడు టేకులు తీసుకుంటే... తెలుగులో సింగిల్ టెక్ లోనే చెప్పేస్తుందంటూ శ్రద్ధా కపూర్ ని పొగిడేస్తున్నాడు. ఇక సినిమాకి స్క్రిప్ట్ హీరో అని చెబుతున్నాడు. ఆ స్క్రిప్ట్ ని సరిగ్గా హ్యాండిల్ చేస్తూ ప్రేక్షకులకు నచ్చే విధముగా సినిమాని మలచగలిగేది ఒక్క దర్శకుడే అని అన్నాడు. ఇంకా సాహో సినిమాలో 11 కీలక పాత్రలు ఉన్నాయని ఆ పాత్రలే సినిమాకి ప్రధాన బలమని చెప్పాడు.