హీరోగా ఒకప్పుడు కామెడీ సినిమాలతో పాటు.. ఫ్యామిలీ ఎంటెర్ టైనర్స్ చేసిన సీనియర్ హీరో నరేష్ గత కొన్ని ఏళ్ళనుండి చిన్నా చితకా పాత్రలతోనే నెట్టుకొస్తున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు మలుపు తిరుగుతుందో చెప్పలేం. అలానే మన నరేష్ ఈ మధ్య అనూహ్యంగా పుంజుకున్నాడు. తన చక్కటి పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. గత ఏడాది వచ్చిన ‘శతమానంభవతి’ మొదలుకుని.. ఇటీవల వచ్చిన ‘సమ్మెహనం’ వరకు నరేష్ ఎన్నో కీలక పాత్రలు చేశాడు.
ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన ‘సమ్మోహనం’ విజయంలో ఆయన పాత్ర చాలా కీలకం. సుధీర్ బాబుకి తండ్రి పాత్రలో.. సినిమా అంటే పడిచచ్చిపోయే పాత్రలో ఇరగతీశాడని అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చింది. డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి.. నరేష్ ను సరిగా వాడుకున్నాడని అంటున్నారు. ఇంతకు ముందు నరేష్ అవకాశాలు కోసం ఎదురు చూశాడు.. కానీ ఇప్పుడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూ కాళీ లేక కొన్ని సినిమాలకి నో చెబుతున్నాడు.
‘సమ్మోహనం’ తర్వాత నరేష్ ఓ పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేశాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడని సమాచారం. అయితే అది ఏ పాత్ర అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇదే కాకుండా ఒక అరడజను దాకా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు నరేష్. ‘సమ్మోహనం’ సినిమా ఆయనను మరింత బిజీ అయ్యేలా చేసింది. అంతే కాదు యాక్టింగ్‌లో బిజీగా ఉంటూనే నరేష్ రచయితగా కూడా తన ప్రతిభ చూపించే పనిలో ఉన్నాడు. రీసెంట్ ఈయన ఓ కథ రాసి దాన్ని ఓ యంగ్ డైరెక్టర్ కి ఇచ్చాడని టాక్. అయితే దీని గురించి అఫీషియల్ గా అనౌన్స్ రానుంది.