Advertisementt

ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే..!!

Thu 21st Jun 2018 10:27 PM
jr ntr,aravinda sametha,two shades,two names  ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే..!!
NTR Mass and Class Roles in Aravinda Sametha ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే..!!
Advertisement
Ads by CJ

తారక్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అరవింద సమేత'. ఈ చిత్రానికి సంబంధించి ఆల్రెడీ సగం పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. మొదటి సారి త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. టైటిల్.. ఫస్ట్ లుక్ తో ఇదేదో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న చిత్రం అని తెలియగానే...జనాల్లో ఈ చిత్రంపై క్యూరియాసిటీ నెలకొంది.

ఇప్పుడు దీనికి మరింత ఊతమిచ్చేలా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో తారక్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట. ఫస్ట్ హాఫ్ లో యంగ్ లవర్ బాయ్ గా సాఫ్ట్ వెర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడు. సెకండ్ హాఫ్ లో వీర రాఘవగా కనిపించనున్నాడని టాక్. అయితే అసలు తారక్ అలా రెండు షేడ్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో అనేదే సస్పెన్స్.

ఆల్రెడీ తారక్ 'జై లవకుశ' సినిమాలో త్రిపాత్రాభినయం చేసి తన నటనతో అందరిని మెప్పించాడు. ఈ సినిమాలో కూడా తన నటనతో విశ్వరూపం చూపించనున్నాడు అని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే వీర రాఘవ పాత్ర పూర్తి మాస్ ఎలేవేషన్స్ తో ఉంటుందని.. దానికి తగ్గట్టే త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడని సమాచారం. ఇకపోతే ఇందులో నాగబాబు.. జగపతి బాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ దసరాకి ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.

NTR Mass and Class Roles in Aravinda Sametha:

NTR Two Shades! Two Names!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ