మహేష్ బాబు - వంశి పైడిపల్లిల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు డెహ్రాడూన్ లో మొదలైంది. పివిపి లో సమస్యల వలన సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టడానికి రెండు వారాల పాటు లేట్ అవడంతో... ఇప్పుడు మహేష్ 25 మూవీ షూటింగ్ ని మొదలెట్టేసి చక చక ఫినిష్ చేసేయాలని వంశి పైడిపల్లి కంకణం కట్టుకున్నాడు. నిర్మాత పివిపి కి చెయ్యాల్సిన వంశీ పైడిపల్లి, మహేష్ మూవీ... దిల్ రాజు నిర్మాణంలో చేపట్టడంతో మొదలైన గొడవలు... కోర్టు కేసులు అంటూ ఇంకా ఇరకాటంలోనే ఉంది. కోర్టు బయట దిల్ రాజు బ్యాచ్ పివిపి తో సెటిల్మెంట్ చేసుకుందామనుకుంటే పివిపి మొండితనం వలన అది కుదరకపోయేసరికి... ఇంకా కోర్టు కేసులంటూ కూర్చుంటే.. సమయం వృధా అవుతుందననుకున్నారో.. లేదంటే కోర్టు కేసులతో మనకేంటి అనుకున్నారో.... మహేష్ - వంశి పైడిపల్లిలు పూర్తి స్క్రిప్ట్ తో సెట్స్ మీదకెళ్లిపోయారు.
ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం చిత్రం బృందం మొత్తం డెహ్రాడూన్ లో ల్యాండ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో మహేష్ కొత్తగా న్యూ లుక్ లో కనిపిస్తాడని... దాని కోసమే గెడ్డం, మీసం, హెయిర్ స్టయిల్లో మార్పులు చేర్పులు కూడా చేశాడు మహేష్ బాబు. సమ్మోహనం ఆడియో లాంచ్ అప్పుడు మహేష్ బాబు రఫ్ గా గెడ్డం లుక్ తో పాటు పాపిడి పక్కకి తీసి న్యూ హెయిర్ స్టైల్ లో కనిపించాడు. దాదాపుగా ఇప్పుడు మహేష్ 25 మూవీ మహేష్ లుక్ అదే. ఎందుకంటే డెహ్రడూన్ షూటింగ్ లొకేషన్ నుండి లీకైన ఒక పిక్ లో మహేష్ బాబు సమ్మోహనం లుక్ అంటే సేమ్ ఇప్పటికి అదే లుక్ లో కాస్త రఫ్ గా కనబడుతున్నాడు. ఆ లుక్ లో మాస్ లుక్ లో మహేష్ ఇరగదీస్తున్నాడు. పిక్చర్ పూర్తిగా క్లారిటీ లేదుగాని.. లేదంటే మహేష్ లుక్ దాదాపుగా రివీల్ అయ్యేది.
ఇక డెహ్రాడున్ లో మహేష్ బాబు హీరోయిన్ పూజ హెగ్డేల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటుగా... ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ మీద కూడా కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలుస్తుంది. మరి ఇప్పటికే అల్లరి నరేష్, వంశి పైడిపల్లి సినిమా కోసం డెహ్రాడూన్ చేరుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అధికారికముగా మొదలై శరవేగంగా పూర్తి చేసుకుని.. వచ్చే సంక్రాతి బరిలో దించే యోచనలో వంశి అండ్ మహేష్ బాబు తో పాటుగా సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న దిల్ రాజు ఉన్నాడు.