Advertisementt

చరణ్, బోయపాటి సినిమాపై 'రంగస్థలం' ఊపు!!

Thu 21st Jun 2018 07:21 PM
ram charan,boyapati srinu,uv creations,andhra,nizam  చరణ్, బోయపాటి సినిమాపై 'రంగస్థలం' ఊపు!!
UV Creations Bags RC12 in Telugu States చరణ్, బోయపాటి సినిమాపై 'రంగస్థలం' ఊపు!!
Advertisement
Ads by CJ

ఈమధ్యన యువి క్రియేషన్స్ జోరు మాములుగా లేదు. నిర్మాణ రంగంలోనే కాదు. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ యువి వారు మాములు జోరు చూపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ తో సాహో చిత్రాన్ని భారీగా  నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ నిర్మాతలు ఏపీ పరిసర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్ గా ఎప్పుడో పాతుకుపోయారు. తాజాగా రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాతో నైజాం లోను జెండాని గట్టిగా పాతేశారు. నైజాంలో దిల్ రాజుని పక్కకి తప్పించి రంగస్థలం నైజాం రైట్స్ ని భారీ మొత్తానికి కొన్నప్పటికీ... ఆ సినిమా యువి క్రియేషన్స్ వారికి భారీ లాభాలు తెచ్చింది. ఆ దెబ్బకి యువి క్రియేషన్స్ వారు ఇప్పుడు రామ్ చరణ్ - బోయపాటి సినిమాని హోల్సేల్ గా రెండు రాష్ట్రాల హక్కులను భారీ ధరకు కొనేసిన్నట్టుగా ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

యువి క్రియేషన్స్ కి ప్రభాస్ కి ఎలాంటి సంబంధాలున్నాయి తెలిసినవే. ఇక  చరణ్ రంగస్థలం సినిమాకి అదరగొట్టే లాభాలందుకున్న యువి వారికి ఇప్పటికే సీడెడ్ తో పాటు, ఉత్తరాంధ్ర, కృష్ణా,  గుంటూరు, తూర్పు గోదావరి ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ పై బాగా పట్టుంది. ఇక చరణ్ రంగస్థలంతో నైజాంలో కూడా సత్తా చాటడంతో.. ఏకంగా ఇప్పుడు రామ్ చరణ్ కొత్త సినిమాకి సంబందించిన రైట్స్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు డీల్ సెట్ చేసుకోవాలన్నది వీరి ఉద్దేశ్యం అని అంటున్నారు. మరి ఇప్పటికే చరణ్ - బోయపాటి కాంబోని సెట్ చేసిన డి వి వి దానయ్యతో యువి వారు చర్చలు జరిపినట్లుగా కూడా  కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.

మరి ఈ డీలింగ్ తో యువి వారు మామూలు డిస్ట్రిబ్యూటర్స్ గా కాదు స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్స్ గా టాలీవుడ్ లో జెండా పాతడం అనేది మాత్రం పక్కా అంటున్నారు. ఇక రంగస్థలం సినిమాకి నైజాంలో భారీ రేట్ కోడ్ చేసిన యువి వారికే చరణ్- బోయపాటి మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయట. మరి రేటు విషయంలోనే ఒక ఐదు కోట్ల దగ్గర అటూ ఇటూగా ఊగిసలాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక చరణ్ - బోయపాటి శ్రీనుల కాంబోకి సుమారుగా 75 కోట్లకు బేరం ఫైనల్ కావచ్చని ఫిలింనగర్ టాక్.

UV Creations Bags RC12 in Telugu States:

UV Creations bagged Ram Charan - Boyapati Film Andhra and Nizam rights  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ