తెలుగులో నేడు మోస్ట్ డిజైరబుల్ బ్యాచ్‌లర్స్ లో రానా దగ్గుబాటి ఒకరు. 'బాహుబలి' చిత్రంలోని భళ్లాలదేవ, ఆ తర్వాత 'ఘాజీ, నేనే రాజు నేనేమంత్రి' వంటి హిట్స్‌తో ఈయన ఊపు మీదున్నాడు. ప్రస్తుతం తమిళంలో ఓ పీరియాడికల్ మూవీతో పాటు 'హాథీమేరా సాథీ' తెలుగులో 'అరణ్య'తో పాటు మరో చిత్రంగా కూడా ఆయన నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక రానా గురించి చాలా మందికి తెలియని ఓ సీక్రెట్‌ని ఆయన ఇటీవల రివీల్ చేశాడు. పుట్టుకతో తనకు ఒక కన్ను సరిగా కనపడేది కాదని, ఎల్వీప్రసాద్ ఐఇన్‌స్టిట్యూట్‌లో వేరేవారి కన్ను తనకు అమర్చారని చెప్పాడు.
ఇక ఈ మద్య రీసెంట్‌గా ఆయన తన కన్నుబాగా బాదిస్తోందని, అందుకే తాను విదేశాలకు వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. వీటిని ఆయన తండ్రి సురేష్‌బాబు కూడా కన్‌ఫర్మ్ చేశాడు. ఇక రానా కంటితో బాధపడుతుంటే మీడియాలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనకు కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని, కిడ్నీలు బాగా పనిచేయకపోవడం వల్ల ఆయన బాధపడుతున్నాడని, కిడ్నీలు మార్చాలని వార్తలు వస్తున్నాయి. వాటిని తాజాగా రానా ఖండించాడు.
ఎప్పటిలాగే నేను ఫిట్ అండ్ ఫైన్‌గా ఉన్నాను. నా కంటి సర్జరీ అనుకున్న దాని కన్నా లేటయింది బిపీ ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ కుదరలేదు. బిపీ కంట్రోల్‌కి వచ్చిన వెంటనే విదేశాలలో కంటి ఆపరేషన్ చేయించుకుంటాను. ఆ తర్వాత కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. నేను కమిట్ అయిన చిత్రాలన్నీ షూటింగ్‌లను జరుపుకుంటున్నాయి. ఇప్పటికీ ముంబై-హైదరాబాద్ మధ్య బాగా తిరుగుతున్నానని తేల్చి చెప్పాడు. ఇక రానా ఇప్పుడు బిపీ విషయం ఎత్తాడు కాబట్టి ఇక దానిని ఆధారంగా చేసుకుని మరెన్ని పుకార్లు పుట్టుకొస్తాయో వేచిచూడాల్సివుంది...!