పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈ మద్యకాలంలో తన పిల్లల విషయంలో బాగా ఎమోషనల్‌గా ఫీలవుతోంది. ముఖ్యంగా యుక్తవయసుకి వచ్చిన తన కుమారుడు అకీరానందన్ విషయంలో ఆమె ఎక్కడలేని సెంటిమెంట్ ఫీలవుతోంది. ఇటీవలే ఓ వ్యక్తి చేతిని పట్టుకుని భావోద్వేగ కవిత ద్వారా తాను మరొకరిని ఇష్టపడుతున్నానని తెలిపిన ఆమె తాజాగా అకీరాకి చెందిన ఓ ఇంటెన్సివ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది అకీరా ఓ గేమ్ యాప్ కోసం ల్యాప్‌ట్యాప్‌లో సెర్చ్ చేస్తున్న ఫొటోగా ఆమె తెలిపింది.
ఇక తన కుమారుడిని ఎవ్వరూ జూనియర్ పవర్‌స్టార్ అని పిలవవద్దని, అలా పిలిచేవారిని బ్లాక్ చేస్తానని చెప్పింది. అయితే వెంటనే ఓ నవ్వుతున్న ఎమోజీని కూడా పోస్ట్ చేసి ఈ విషయంలో తాను మరీ అంత సీరియస్ కాదనే విషయాన్ని తెలిపింది. ఇక తన కుమారుడిని జూనియర్ పవర్‌స్టార్ అని పిలవడం తనకు, తన బిడ్డకు, తండ్రికి కూడా ఇష్టం లేదని, పవన్‌కళ్యాణ్ కుమారుడిగా కాకుండా తన సొంతగా ఎదగాలని ఆమె తన కుమారుడిని కోరుకుంది.
అయితే ఎవరు ఎన్ని చెప్పినా భవిష్యత్తులో అకీరానందన్ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం పక్కానే అని అందరు ఒప్పుకుంటున్నారు. రేణు ఎంత వారించినా కూడా ప్రేక్షకులు ఆయన్ను పవన్‌కళ్యాణ్ కుమారుడిగా, జూనియర్ పవర్‌స్టార్‌గానే పిలుస్తారు. అకీరా తెరంగేట్రం చేస్తే మెగాభిమానులు, మెగా ఫ్యామిలీ అతనికి అండగా నిలబడటం ఖాయం. మరి అదే పరిస్థితి ఎదురయితే పవన్ పాత్ర అందులో ఎంత వరకు? ఆయన ఉద్దేశ్యం ఏమిటి? అనేవి మాత్రం తేలాల్సివుంది.