మొదటిసారిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందునా.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి వారితో పోటీ పడి ఓ యువ హీరో గెలుపొందితే దానిని జీవితాంతం తీపిజ్ఞాపకంగా తన ఇంటిలో పదిల పరుచుకోవాలని భావిస్తారు. దానిని చూసినప్పుడల్లా ఉత్తేజం పొందాలని భావిస్తారు. కానీ యువస్టార్‌గా చెప్పుకోదగ్గ అర్జున్‌రెడ్డి తన యూటిట్యూడ్ ఎప్పుడు కాస్త డిఫరెంటేనని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం' వంటి చిత్రాల తర్వాత 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి'తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన విజయ్‌దేవరకొండ తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుపొందాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేస్తూ తనకి వచ్చిన ఫిల్మ్‌ఫేర్ అవార్డును వేలం వేసి ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇస్తానని సర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పాడు. ఎంతో మంది వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉండి మంత్రి కేటీఆర్‌ని సాయం అడుగుతూ ఉంటే వారికి ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేయడాన్ని రోజు ట్విట్లర్‌లో గమనిస్తూ ఉన్నానని, ఈ అవార్డు తన ఇంట్లో ఉండటం కంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తాను పుట్టిన రాష్ట్రానికి ఉపయోగపడటం తనకి ఎంతో తృప్తినిచ్చే విషయమని విజయ్‌దేవరకొండ తెలిపాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ విజయ్‌దేవరకొండ నిర్ణయాన్ని ప్రశంసించాడు. తొలి ఫిల్మ్‌ఫేర్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆయన దాని ద్వారా సాయం చేయాలనుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చొరవను అభినందిస్తున్నాను. ఈ విషయంలో ఏమి చేయాలో త్వరలో కూర్చుని మాట్లాడుకుందామని ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ విషయంలో అర్జున్‌రెడ్డి నిర్ణయాన్ని, ఆయన చొరవను అందరు అభినందిస్తున్నారు.