Advertisementt

ఈసారి సంక్రాంతి ఫైట్ అదిరిపోనుంది!

Tue 19th Jun 2018 09:35 PM
sankranthi,balakrishna,ntr biopic,ram charan,mahesh babu  ఈసారి సంక్రాంతి ఫైట్ అదిరిపోనుంది!
2019 Sankranthi Release Movies ఈసారి సంక్రాంతి ఫైట్ అదిరిపోనుంది!
Advertisement
Ads by CJ

ప్రతి ఏడాది సంక్రాంతి పండగకు చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. చిన్న సినిమాలు నుండి పెద్ద సినిమాలు వరకు ఈ రేస్ లో ఉంటాయి. అలానే వచ్చే సంక్రాంతి పండుగ బాగా రసవత్తరంగా సాగనుంది. ప్రతి ఏటా సంక్రాంతికి తన సినిమా కచ్చితంగా ఉండేటట్టు చూసుకుంటాడు బాలయ్య. ఎందుకంటే బాలయ్యకు సంక్రాంతి పండగ అంటే అంత సెంటిమెంట్.

ఈసారి కూడా తన కొత్త సినిమాను రంగంలోకి దింపనున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9న విడుదల కానుండగా.. ఈ సీజన్ లో మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న బోయపాటి - చరణ్ సినిమా చాలా భాగం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.  ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుండగా.. ఆ తర్వాత పాటలను పిక్చరైజ్  చేయనున్నారు.

దసరాకి ఈ సినిమా కంప్లీట్ అవ్వడం కష్టం అని తెలుసుకుని సంక్రాంతికి వస్తున్నట్టు ఆఫిషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్. ఇక ఈ రేస్ లో కొత్తగా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడు. తాజాగా మహేష్ హీరోగా.. వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ చిత్రం కూడా సంక్రాంతి రేసులోనే నిలవనుంది. 4 నెలల సమయంలో షూటింగ్ పూర్తి చేసి.. పక్కాగా పోస్ట్ ప్రొడక్షన్ సమయం కేటాయిస్తారట. సో వచ్చే సంక్రాంతికి బాలయ్యతో పాటు.. రామ్ చరణ్.. మహేష్ లు పోటీ పడటానికి రెడీ అవుతున్నారు.

2019 Sankranthi Release Movies:

Ram Charan and Mahesh Babu's Clash Again?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ