మొత్తానికి రోజులు గడిచే కొద్ది పరిస్థితులు శ్రీరెడ్డికి అనుకూలంగా మారుతున్నాయి. అదృష్టమో, విధివశాత్తో గానీ ఆమె మాటలకు రోజు రోజుకి బలం చేకూరుతోంది. దాంతో ఈమె మరింతగా రెచ్చిపోతోంది. గత రెండు మూడు రోజులుగా అమెరికా కేంద్రంలో టాలీవుడ్ నటీమణులు వ్యభిచారం కేసు సంచలనం సృష్టిస్తోంది. అమెరికా పోలీసులు అంటే తీగ లాగితే డొంక తిరగడం ఖాయమనే చెప్పాలి. వారి చట్టాలు, పనీతీరు మీద ప్రపంచవ్యాప్తంగా అందరికీ అంత విశ్వాసం ఉంది. సో.. ఈ సారి ఈ చికాగో సెక్స్‌రాకెట్ ద్వారా పలువురి పేర్లు బయటకు రావడం ఖాయమనే అంటున్నారు. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి ఈ నిప్పుకి మరింత ఆజ్యం పోసింది.
అమెరికన్ సెక్స్‌రాకెట్‌లో పాల్గొన్న బడా హీరోయిన్లు, చిన్న హీరోయిన్లు, యాంకర్ల లిస్ట్ కూడా తన వద్ద ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. వాటిని ఇప్పటికే సీఎన్‌ఎన్. ఐబిఎన్ చానెల్స్‌కి ఇచ్చేశాను. మీ భాగోతాలన్నీ బయటపెడుతున్నా జాగ్రత్త... అంటూ ఆమె చెప్పిన శ్రీరెడ్డి లీక్స్ పెనుదుమారాన్నే రేకెత్తిస్తున్నాయి. ఆ వెంటనే ఆమె ఇందులో పాల్గొన్న మరో హీరోయిన్ హింట్ ఇచ్చి తానేదో మాటలతో భయపెట్టే వ్యక్తిని కాదని, తాను చేతల్లో చూపిస్తానని సవాల్ చేసింది. తెలుగులో ఓ టాప్‌హీరోయిన్ ఉంది. ఆమె ఎక్కువగా సాయిధరమ్‌తేజ్‌తో కలిసి యాక్ట్ చేసింది అంటూ క్లూ ఇచ్చింది.
దీంతో ఆ హీరోయిన్ ఎవరో ఈజీగానే అందరికీ అర్ధమవుతోంది. మరి ఈ లీక్స్‌లో ఆమె మరెన్ని పేర్లు బయటపెడుతుందో గానీ వర్మ ఉదంతం తర్వాత కాస్త డిఫెన్స్‌లో పడి మౌనంగా ఉన్న శ్రీరెడ్డి మరోసారి సంచలనాలకు కేంద్రబిందువు కావడం మాత్రం ఖాయమనే చెప్పాలి....!