శ్రీరెడ్ది తెలుగులో కాస్టింగ్‌కౌచ్ గురించి బయట పెట్టినప్పుడు కొందరు ఆమె ఏదో పాపులారిటీ, వార్తల్లో నిలవడం కోసం అలా చేస్తోందని భావించారు. కానీ కొందరు మాత్రం బయటకు వచ్చి శ్రీరెడ్డికి మద్దతు తెలిపారు. సినీ పెద్దలు మాత్రం అబ్బే అవేం లేదు.. టాలీవుడ్ నిప్పుతో సమానం. శ్రీరెడ్డి వంటి వారందరు ఇండస్ట్రీ పరువును తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక తాజాగా అమెరికాలో టాలీవుడ్ సెక్స్‌రాకెట్ డొంక కదిలింది. ఇక ఈ కాస్టింగ్ కౌచ్ గురించి గేయ రచయిత శ్రేష్ట తాజాగా సంచలన ఆరోపణలు చేసింది.
నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా సార్లు కాస్టింగ్‌కౌచ్‌ని ఎదుర్కొన్నాను. స్వయంగా ఓ మహిళే తన భర్త వద్దకు వెళ్లి పడుకోవాలని నాపై బలవంతం చేసింది. మరో మహిళా దర్శకురాలు నీకు ప్రపోజ్ చేయడం కోసమే ఓ వ్యక్తి గోవాలో పార్టీ ఇస్తున్నాడు. అక్కడికి వెళ్లి అతని ప్రపోజల్‌కి ఓకే చెప్పు అని బలవంతం చేసింది. నేను ఆమె మాటలు పట్టించుకోలేదు. దాంతో ఆ వ్యక్తి గోవా నుంచి ఫోన్ చేసి నన్ను ఎంతో అసభ్యంగా దూషించాడు. దానిని బట్టి ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ చేసేది మగవారే కాదని, ఆడవారు కూడా బలవంతం చేస్తారని నాకు అర్ధమైందని చెప్పుకొచ్చింది. నిజానికి గేయ రచయితకే ఇలాంటి పరిస్థితి ఎదురయిందంటే ఇక హీరోయిన్ల విషయంలో ఇది ఎంత బలంగా ఉందో ఈమె మాటలను బట్టి అర్ధమవుతోంది.
ఇలాంటి సంఘటనల వల్లనే నేను ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని శ్రేష్ట చెప్పుకొచ్చింది. శ్రేష్ట ఇప్పుడిప్పుడే పాటల రచయితగా మంచి పేరు సంపాదించుకుంటోంది. ఆమె 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, మధురం మధురం, యుద్దంశరణం' వంటి చిత్రాలకు సాహిత్యాన్ని అందించింది.