మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుస వైఫల్యాలతో ఢీలా పడిపోయాడు. ప్రస్తుతం ప్రేమ కథ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ ని నమ్ముకున్న సాయి ధరమ్ తేజ కరుణాకరన్ డైరెక్షన్ లో 'తేజ్ ఐ లవ్ యు' అనే చిత్రాన్ని చేశాడు. అయితే ఈ చిత్రానికి ఎందుకో ట్రేడ్ లో అస్సలు బజ్ లేదు. మెగాస్టార్ చిరంజీవి 'తేజ్ ఐ లవ్ యు' సినిమా ప్రమోషన్స్ కి అటెండ్ అయినా కానీ ప్రేక్షకుల్లోనూ అలాగే ట్రేడ్ లోను 'తేజ్ ఐ లవ్ యు' మీద క్రేజ్ క్రియేట్ అవడం లేదు. మెగా అభిమానులకు తప్పదు కాబట్టి 'తేజ్ ఐ లవ్ యు' ని ప్రమోట్ చేస్తున్నారు..అలాగే సినిమా మీద కాస్త ఆసక్తితోను ఉన్నారు. అనుపమ పరమేశ్వరన్ లక్ ఏమన్నా సాయి ధరమ్ కి తగిలితే తప్ప ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ లేదు.
అనుపమ క్యూట్ లుక్స్ తో తన మూవీస్ అన్నిటిలోను అందరిని మైమరపించింది. అలాగే ఆమె నటించిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్స్. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ 'తేజ్ ఐ లవ్ యు' సినిమాకి ఒక్క పైసా పారితోషకం కూడా తీసుకోలేదట. ఎందుకంటే సాయి ధరమ్ కి వరుస ప్లాప్స్ ఉన్న టైం లో తేజ్ తో సినిమా చెయ్యడానికి గతంలో హిట్ నిర్మాత.. ప్రస్తుతం ప్లాప్ నిర్మాత అయిన కే ఎస్ రామారావు ముందుకు రావడంతో.. ఆయన మీద కృతజ్ఞతతోనే సాయి ధరమ్ తేజ్ ఆయన నుండి నయా పైసా పారితోషకం తీసుకోలేదట. అయితే షూటింగ్ కి సంబందించిన కొన్ని ఖర్చుల మినహా పారితోషకం తీసుకోలేదని తెలుస్తుంది.
మరి 'తేజ్ ఐ లవ్ యు' సినిమా విడుదలై హిట్ అయ్యి కలెక్షన్స్ దండిగా వస్తే గనక పారితోషకం తీసుకోని... సాయి ధరమ్ తేజ్ కి లాభాలలో వాటా ఇచ్చే ఉద్దేశంతో నిర్మాత కే ఎస్ రామారావు వున్నట్టుగా చెబుతున్నారు. మరి అనుపమ పరమేశ్వరన్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ ఈ ప్రేమ కథ చిత్రంతో హిట్ కొట్టాలని గట్టిగానే డిసైడ్ అయ్యాడట. చూద్దాం సాయి ధరమ్ తేజ్ 'తేజ్ ఐ లవ్ యు' తో మళ్ళీ ఏమాత్రం నిలదొక్కుకుంటాడో అనేది.