ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే చాలు భయపడిపోతున్నారు. వర్మ నుండి సినిమా వస్తుంది అంటే చాలు.. బాబోయ్ ఈ దర్శకుడి సినిమానా.. వద్దులే అనేస్తున్నారు. ఆఖరుకి నాగార్జునతో సినిమా చేసినా వర్మ బిహేవియర్ మారలేదంటే.. రామ్ గోపాల్ వర్మ పిచ్చ ఏ స్టేజ్ లో ఉందో అర్ధమవుతుంది. తనకు నచ్చిన సినిమాలను ప్రేక్షకుల మీద రుద్దడం మాత్రం వర్మ మానడం లేదు. గత పదేళ్లుగా అవే సినిమాలు, అవే కథలు ఎందులోనూ కొత్తదనం లేదు.. మార్పు లేదు. పోనీ టాలెంట్ కరిగిపోయింది సినిమాలకు దూరంగా వుంటున్నాడా? అబ్బే లేదు. ఒక సినిమా వెంటనే మరో సినిమాని అనౌన్స్ చేస్తున్నాడు.
ఆఫీసర్ సినిమాతో కోలుకోలేని ప్లాప్ అందుకున్న వర్మ ఇక సినిమాలు మానేస్తాడేమో అనుకునేలోపు మళ్ళీ కొత్త సినిమా ఉంటుందంన్నాడు . ఇక ఆ సినిమా కూడా హింసాత్మకమైన ప్రేమ కథగా ఉండబోతుందంటూ ఒక క్లూ కూడా ఇచ్చాడు. ఆఫీసర్ సినిమాని తలా లేకుండా తోకా లేకుండా డైరెక్ట్ చేసిన వర్మ.. ఈసారి కొత్త సినిమాని తాను డైరెక్ట్ చెయ్యకుండా.. కేవలం నిర్మాతగా.. భాస్కర్ రాశి అనే నిర్మాతతో పార్టనర్ షిప్ కలిసి ఈ సినిమాని ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. సిద్దార్ధ్ అనే కొత్త దర్శకుడితో వర్మ ఈ హింసాత్మకమైన ప్రేమ కథకు శ్రీకారం చుడుతున్నాడు.
ఇక ఈ సినిమాలో ఈసారి టాలీవుడ్లో ఏ హీరోలు నటించడం లేదు. కన్నడ హీరో ధనంజయ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే తగరు అనే కన్నడ సినిమాతో బాగా పాపులర్ అయిన ధనంజయ హీరోగా నటిస్తున్నాడు. మరి టాలీవుడ్ లో సినిమాలు చెయ్యడానికి భయపడిన వర్మ ఇలా కన్నడ హీరోతో... ప్రేమ కోసం భూస్వామ్య వ్యవస్థకు ఎదురుతిరిగే ఒక అనుచరుడి కథగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి వర్మ.. ఆ రోజుల్లో సినిమాని చుట్టి పడెయ్యగల నేర్పరి. మరి ఆయన నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ సినిమాకి అప్పుడే టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారట. వర్మ నిర్మాణంలో నిర్మితం కాబోయే ఆ హింసాత్మక ప్రేమ కథ టైటిల్ 'భైరవ గీత' గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జూన్ 21 న విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయట.