Advertisementt

అనసూయ ఫ్యాన్స్ కి నేను నచ్చలేదు: రష్మి!

Mon 18th Jun 2018 08:27 PM
  అనసూయ ఫ్యాన్స్ కి నేను నచ్చలేదు: రష్మి!
Anasuya Fans Trolled Me, says Rashmi అనసూయ ఫ్యాన్స్ కి నేను నచ్చలేదు: రష్మి!
Advertisement
Ads by CJ

సినిమాలో నటించిన తర్వాత ఆమెకు పెద్దగా పేరు రాకపోవడంతో బుల్లితెర వైపు కన్నేసింది రష్మి గౌతమ్. తెలుగులో 'మా' టీవీ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ‘యువ’ అనే సీరియల్‌తో పేరు సంపాదించింది. ఆ పై ‘జబర్దస్త్’ యాంకర్‌గా తిరుగులేని ఫేమ్ తెచ్చుకుంది. అలా బుల్లితెరపై పేరు సంపాదించుకుని సినిమాల ఛాన్సులు కొట్టేసింది.

అయితే జబర్దస్త్ లో తాను యాంకరింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు రష్మి చెప్పింది. అనసూయ ప్లేస్ లో నేను యాంకరింగ్ స్టార్ట్ చేయడం చాలా మందికి నచ్చలేదని.. సోషల్ మీడియాలో నన్ను అనసూయ ఫ్యాన్స్ తిట్టారని... ట్రోల్ కూడా చేసారని చెప్పింది. అప్పుడు కానీ నాకు అర్ధం కాలేదు అనసూయకు ఎంత పాపులారిటీ వుంది అనేది.

అనసూయకి నాకు ప్రొఫెషనల్ గానే పోటీ.. కానీ అందరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నేను, ఆమె మంచి స్నేహితులని రష్మి చెప్పింది. యాంకరింగ్ లో ఇద్దరిది సపరేట్ రూట్ అని... ఎవరి ఐడెంటిటీ కోసం వాళ్లు ట్రై చేస్తుంటామని చెప్పింది. వైజాగ్ కి చెందిన నేను అప్పుడప్పుడు హైదరాబాద్ భోజనం మిస్ అవుతుంటానని.. అలా అనిపించినప్పుడు అనసూయ ఇంటికి వెళ్లి భోంచేస్తానని రష్మి చెప్పింది. అనసూయ పిల్లలతో చాలా క్లోజ్ గా ఉంటానని వెల్లడించింది.

Anasuya Fans Trolled Me, says Rashmi:

Rashmi about Anasuya Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ