తెలుగు ప్రేక్షకులకు మంచి టాలెంట్ ఉన్న నటిగా గుర్తుండిపోయే చిత్రాలను చేస్తున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈమె తాజాగా విజయవాడలో జరిగిన 'తేజ్ ఐ లవ్ యు' ఆడియో సక్సెస్ మీట్‌లో పలు విషయాలను వెల్లడించింది. నేను నటించిన 'అ..ఆ' చిత్రం విజయోత్సవ వేడుక గుంటూరులో జరిగింది. ఆ సమయంలోనే పక్కనే ఉన్న విజయవాడ గురించి తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చిన వెంటనే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాను. 'తేజ్ ఐ లవ్ యు' చిత్రం మంచి లవ్‌స్టోరీ. ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది.
ఇక నాకు అత్యంత ఇష్టమైన స్టార్ చిరంజీవి. ఆయన నటించిన చిత్రంలో అర నిమిషం పాటు నటించే అవకాశం వచ్చినా జన్మ ధన్యమైనట్లు భావిస్తాను. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో బిజీగా ఉన్నాను. నా అభిమాన నటి నిత్యామీనన్, సావిత్రిగారు ఎంతో గొప్పనటి. ఆమె గురించి 'మహానటి' చిత్రం చూసి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. కెరీర్ మొదట్లో తెలుగు మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడేదానిని.
కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడగలుగుతున్నాను. టాలెంట్ ఉంటే అవకాశాలకు ఎప్పుడు డోకా ఉండదు. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న 'హలో గురు ప్రేమకోసమే' చిత్రంలో నటిస్తున్నాను. మంచి టాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా ముందున్న లక్ష్యమని తెలిపింది.