Advertisementt

'ఏకే 47' బాలయ్య కాదు..!

Mon 18th Jun 2018 12:42 PM
ak 47,balakrishna,vv vinayak,c kalyan,title  'ఏకే 47' బాలయ్య కాదు..!
Balayya Is Not AK 47 'ఏకే 47' బాలయ్య కాదు..!
Advertisement
Ads by CJ

మాస్ డైరెక్టర్ వినాయక్ డైరెక్షన్ లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒకవేళ క్రిష్ ఈలోపల ఎన్టీఆర్ బయోపిక్ కి రెడీ చేస్తే బయోపిక్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడు బాలయ్య. అది లేట్ అయ్యే అవకాశం ఉంటే వినాయక్ తో సినిమా చేసి.. ఎట్టి పరిస్థితిల్లో సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు బాలయ్య.

అయితే గత కొన్ని రోజులు నుండి సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఒకటి జోరుగా ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ - వినాయక్ ల సినిమాకి ఏకే 47 అనే టైటిల్ పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఏకే 47 టైటిల్ అనగానే నందమూరి అభిమానుల్లో కూడా కొత్త ఆశలు చిగురించాయి. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ టైటిల్ బాలయ్యది కాదని తేలడంతో అందరు షాక్ అయ్యారు.

నిర్మాత సి కళ్యాణ్ ఛాంబర్ లో ఏకే 47 అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు.ఎప్పటినుండో కళ్యాణ్ బాలకృష్ణతో సినిమా చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడని అనుకున్నారు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ అంత ఈ టైటిల్ బాలయ్య సినిమా కోసమే అని.. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. అయితే కళ్యాణ్ మాత్రం ఇది బాలయ్య సినిమా కోసం కాదని, వేరే సినిమా కోసమని చెప్పాడు. దాంతో బాలయ్య ఏకే 47 అంటూ వస్తున్న ప్రచారానికి తెరపడింది.

Balayya Is Not AK 47:

AK 47 Title Not for Balayya says C Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ