Advertisementt

వినేవారుంటే గోవాబ్యూటీ ఏమైనా చెప్తుంది!

Mon 18th Jun 2018 02:27 AM
  వినేవారుంటే గోవాబ్యూటీ ఏమైనా చెప్తుంది!
Of films, depression, marriage and pregnancy: Ileana D'Cruz opens up వినేవారుంటే గోవాబ్యూటీ ఏమైనా చెప్తుంది!
Advertisement
Ads by CJ

వినేవాడుంటే హరిదాసు ఇంగ్లీషులో హరికథను చెబుతాడనే సామెత ఉంది. ఇక నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నప్పుడు తరచుగా ఒక సామెత చెప్పేవాడు. తల్లికి తిండి పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పాడట అనే వాడు. ఈ రెండు సామెతలు ఇలియానాకి బాగా సూట్‌ అవుతాయి. అమ్మడు సినిమా రంగంలోకి వచ్చి పుష్కరకాలం అయింది. అయినా ఆమె నటించిన చిత్రాలలో ఈతరం వారికే గుర్తుండిపోయేవి ఒకటి రెండు తప్ప ఏమీ లేవు.  

తాజాగా ఈ గోవాబ్యూటీ మాట్లాడుతూ, నేను చేసే చిత్రాలు నా మనవళ్లకి కూడా గుర్తిండిపోయేలా చూసుకుంటున్నాను. నా మనవళ్లు నా చిత్రాలు చూసి ఇదేంటి ఇలాంటి సినిమాలో నటించింది అని ఫీలవ్వకూడదు. ఇక నేను 12ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాను కాబట్టి నా వ్యక్తిగత విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అలాగని నా వ్యక్తిగత జీవితాన్ని అంతా ప్రపంచానికి తెలియజెప్పాలని నేను భావించను. నా జీవితంలోని అవసరమైన విషయాలను మాత్రమే అందరికీ తెలియజేస్తాను. నా పెళ్లి నేను ఊహించినట్లు కాకుండా విరుద్దంగా జరిగింది. గత కొంతకాలం కిందట నేను తీవ్ర డిప్రెషన్‌కి లోనయ్యాను. నాడు నన్ను డాక్టర్‌ వద్దకు వెళ్లమని బలవంతం చేసింది నా భర్త అండ్రూనే. నాడు స్నేహితులను కలవడానికి ఇష్టపడేదానిని కాదు. ఎవరు బయటికి వెళ్దామన్నా వెళ్లాలనిపించేది కాదు. కానీ డాక్టర్‌ వద్ద ట్రీట్‌మెంట్‌ తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. 

ఇలియానా తల్లి కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ మాటలే నిజమైతే సంతోషించేదానిని. అయినా ఇప్పుడే తల్లిని కావాలని అనుకోవడం లేదు. నా జీవితం సాఫీగా ఉంది. అయ్యో సినిమాలు లేవే అనే బాధ లేదు. నా కెరీర్‌ మొదట్లో ఎలాంటి చిత్రాలనైనా ఓకే చేసేదానిని. మంచి రెమ్యూనరేషన్‌ ఇస్తామంటే ఒప్పుకునేదానిని. కానీ ఇప్పుడు నాకు పని కంటే కుటుంబం ముఖ్యం. నా 21ఏళ్ల వయసులో ఒకటే అనుకునేదానిని, నా సినిమాలను చూసి నా మనవళ్లు కూడా సంతోషపడాలి. అలాంటి చిత్రాలు మాత్రమే చేయాలని భావిస్తున్నాను అంటూ తన భర్త అండ్రూతో ఫిజిలో ఎంజాయ్‌ చేస్తోన్న ఈ నడుము సుందరి చెప్పుకొచ్చింది. 

Of films, depression, marriage and pregnancy: Ileana D'Cruz opens up:

Ileana Reacts To Pregnancy Rumors 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ