Advertisementt

కాజలే ఫైనల్ అంటున్నారు..!

Sun 17th Jun 2018 09:33 PM
  కాజలే ఫైనల్ అంటున్నారు..!
Kajal Agarwal to act with Rajinikanth? కాజలే ఫైనల్ అంటున్నారు..!
Advertisement
Ads by CJ

ఇండియాలోనే జయాపజయాలతో సంబంధం లేకుండా రియల్‌ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ మ్యాన్లీ హీరో రజనీకాంత్‌. ఆయన పక్కన ఐశ్వర్యారాయ్‌ నుంచి సోనాక్షిసిన్హా వరకు ప్రతి ఒక్కరు తమ కెరీర్‌లో ఒకసారైనా నటించాలని ఆశపడతారు. చివరకు ఎమీజాక్సన్‌ వంటి యంగ్‌ భామలు కూడా ఆయనతో సినిమా అంటే ఎగిరిగంతేస్తారు. ఇక ఈ తరం హీరోయిన్లలో దక్షిణాది నుంచి ఆయన సరసన నటించే చాన్స్‌ 'శివాజీ' చిత్రం ద్వారా శ్రియకి లభించింది. 'కబాలి'లో రాధికాఆప్టే, తాజాగా 'కాలా'లో ఈశ్వరీరావు ఆయన సరసన నటించారు. ఆయన మైండ్‌ సెట్‌లో కూడా ఈమద్య మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వయసులో కుర్రహీరోయిన్‌ల సరసన నటించిన వారితో రొమాన్స్‌ చేస్తే బాగుండదు కదా..! అని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 

ఇక ప్రస్తుతం రజనీకాంత్‌ 'కాలా' తర్వాత కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో సన్‌పిక్చర్స్‌ పతాకంపై ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో త్రిష, సిమ్రాన్‌, అంజలివంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. సిమ్రాన్‌ అయితే ఖాయమైపోయిందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్‌ పాత్రకి చందమామ కాజల్‌ని ఫిక్స్‌ చేసుకున్నారని సమాచారం. కాజల్‌ ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో సీనియర్‌ స్టార్స్‌తో పాటు యంగ్‌ స్టార్స్‌ సరసన కూడా నటించింది. 

తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సరసన 'ఖైదీనెంబర్‌ 150' లో నటించి మెప్పించింది. దీంతో ఈ చిత్ర యూనిట్‌ తమ చిత్రంలో రజనీకాంత్‌ సరసన కాజల్‌ని పెట్టుకోవడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ఈ విషయం తెలిసిన కాజల్‌ ఎగిరి గంతేసిందని, ఎన్ని రోజులు కాల్షీట్స్‌ అయినా సరే కేటాయించడానికి రెడీగా ఉందని సమాచారం. మొత్తానికి ఈ వార్త నేడు దక్షిణాదిలో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే హీరోయిన్‌గా ఎంటర్‌ అయి దశాబ్దం దాటి 50కి పైగా చిత్రాలలో నటించిన చందమామ ఎంతో లక్కీ అని చెప్పాల్సిందే. 

Kajal Agarwal to act with Rajinikanth?:

I want to act with Rajini, says Kajal Agarwal 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ