Advertisementt

మహేష్ ని సమ్మోహన పరిచింది..!

Sun 17th Jun 2018 06:31 PM
  మహేష్ ని సమ్మోహన పరిచింది..!
Mahesh Babu heaps praises on Sammohanam మహేష్ ని సమ్మోహన పరిచింది..!
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబోలో వచ్చిన సమ్మోహనం ప్రేక్షకులను మాత్రమే సమ్మోహనం చేయడం లేదు... సినిమా ఇండస్ట్రీలోని పలువురిని అందులోను సుధీర్ బాబు బావ సూపర్ స్టార్ మహేష్ ని కూడా సమ్మోహన పరిచింది. ముందు నుండి మహేష్ బాబు, సుధీర్ బాబు సమ్మోహనం కోసం పబ్లిసిటీ చేపట్టాడు. సమ్మోహనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడమే కాదు.. సినిమా విడుదలకు ముందు సమ్మోహనం హిట్ అవ్వాలని.. సుధీర్ బాబు అండ్ ఇంద్రగంటి అండ్ అదితి రావ్ కే కాకుండా చిత్ర  బృందానికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు. ఇక సినిమా కూడా మహేష్ కోరుకున్నట్టుగానే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులంతా సమ్మోహనానికి పాజిటివ్ టాక్ ఇచ్చేసారు. 

ఇంద్రగంటి మేకింగ్ స్టయిల్, అదితి అందాలు, సుధీర్ బాబు నటనకు ప్లస్ మార్కులు పడిపోయాయి. ఇంకా సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ దగ్గరనుండి... సినిమాటోగ్రఫీ వరకు సమ్మోహనం టెక్నీకల్ టీమ్ వరకు అన్ని ఈ సినిమా హిట్ కి కలిసొచ్చాయి. అయితే సమ్మోహనం సినిమా మొదటి రోజే వీక్షించిన మహేష్ బాబు.. ఇంద్రగంటి ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ  రచన, దర్శకత్వం రెండూ చాలా అందంగా ఆహ్లాదంగా సాగాయని.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప ప్రతిభావంతులైన దర్శకుల్లో ఇంద్రగంటి ఒకడని మహేష్ కితాబునిచ్చేసాడు. అంతేకాకుండా సుధీర్ బాబు, అదితిరావు లు అత్యున్నత స్థాయి నటన కనబరిచారని.. వీళ్లిద్దరికీ ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అన్నాడు మహేష్. 

ఇంకా సమ్మోహనం సినిమా విజయంలో ఎక్కువ మార్కులు వేయించుకున్న సీనియర్ నరేష్ నటన గురించి కూడా మహేష్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. మరి మహేష్ సమ్మోహనం సినిమాకి, ఇంద్రగంటి కి ఇచ్చిన కాంప్లిమెంట్స్ తో ఇంద్రగంటి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరి తన కెరీర్ లో మహేష్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ బెస్ట్ అని ఇంద్రగంటి చెబుతున్నాడు అంటే.. మహేష్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ కి ఇంద్రగంటి ఎలా పడిపోయాడో కదా అనిపిస్తుంది. మరి సూపర్ స్టార్ ప్రశంసలా మజాకా...!

Mahesh Babu heaps praises on Sammohanam:

Mahesh Tweets on Sammohanam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ