Advertisementt

ఎమ్మెల్యే అయినా రోజాకి మోజు తీరలేదు!

Sun 17th Jun 2018 03:10 PM
  ఎమ్మెల్యే అయినా రోజాకి మోజు తీరలేదు!
Actress Roja As A Mahanati ఎమ్మెల్యే అయినా రోజాకి మోజు తీరలేదు!
Advertisement
Ads by CJ

తెలుగులో 'సర్పయాగం' చిత్రంతో పరిచయమై, ఆ తర్వాత 'ప్రేమతపస్సు' ద్వారా ప్రశంసలు పొంది, చిరంజీవి నటించిన 'ముఠామేస్త్రి'తో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి రోజా అలియాస్‌ శ్రీలతారెడ్డి. ఆ తర్వాత ఈమె దాదాపు ప్రతి టాప్‌ హీరో సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా 'శుభలగ్నం' వంటి చిత్రాలతో తన నటనా ప్రతిభను చూపించింది. ఇక ఈమె నేడు వైసీపీ పార్టీలో కీలక నేతగా నగరి ఎమ్మెల్యేగా, వైసీపీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన అనర్ఘలమైన మాటల చాతుర్యంతో ప్రత్యర్ధుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈమె కొన్ని చిత్రాలలో సపోర్టింగ్‌ నటి పాత్రలనే కాదు.. ఈటీవీలో ప్రసారమవుతున్న 'జబర్ధస్త్‌'షో లో నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తోంది. 

ఇక తాజాగా ఈమె సావిత్రి బయోపిక్‌గా వచ్చిన 'మహానటి'లోని కీర్తిసురేష్‌ని అనుకరిస్తూ ఓ ఫోటోని తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌ అవుతూ పలువురి ప్రశంసలను పొందుతోంది. ఎంతో అందంగా ఉన్నారు మేడమ్‌.. అనే కాంప్లిమెంట్స్‌ని అందుకుంటోంది. ఇక ఈమె ఫోటోతో పాటు ఒక స్ఫూర్తిదాయకమైన ట్వీట్‌ని కూడా చేసింది. 'నిజమైన మహిళలు అత్యున్నతంగా, శక్తిమంతంగా, స్వతంత్రభావాలతో, నమ్మకంగా, ప్రేమగా ఉంటారని' ట్వీట్‌ చేసింది. 

ఇక ఇటీవల పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, రోజాని 'సర్పయాగం'లో పరిచయం చేసేటప్పుడు రామానాయుడు ఆమెలో ఉన్నగొప్పతనం ఏమిటి? అని అడిగారని, ఆమె నవ్వినప్పుడు చూడండి సార్‌.. అచ్చమైన తెలుగు ఆడపడుచు ఆత్మీయతతో కూడిన నవ్వు నవ్వుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఈ నవ్వుతూ ఉన్న రోజా ఫోటోని చూస్తే పరుచూరి గోపాలకృష్ణ.. రోజా విషయంలో వర్ణించిన విశ్లేషణ అక్షరసత్యమనే అనిపిస్తోంది. 

Actress Roja As A Mahanati:

Roja Mahanati Savitri Getup In Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ