Advertisementt

అదితీరావు హైదరీ సుడి తిరిగినట్లే..!

Sun 17th Jun 2018 01:50 PM
  అదితీరావు హైదరీ సుడి తిరిగినట్లే..!
Aditi Rao Hydari got Hit with Sammohanam movie అదితీరావు హైదరీ సుడి తిరిగినట్లే..!
Advertisement
Ads by CJ

దర్శకదిగ్గజం మణిరత్నం హీరోల విషయాన్ని పక్కనపెడితే హీరోయిన్లను ఎంత అందంగా, లవ్లీగా చూపిస్తారో అందరికీ తెలిసిందే. చిత్ర జయాపజయాలకు అతీతంగా ఆయన కథానాయికలను అందం, అభినయం కలగలిపి చూపిస్తారు. అందుకే ఆయన దర్శకత్వం వహించే చిత్రంలో నటించాలని ఐశ్వర్యారాయ్‌ నుంచి కొత్త వారి వరకు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇక హైదరాబాదీ అమ్మాయి అయిన అదితీరావు హైదరీ.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'చెలియా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా అదితి అందానికి, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. 

ఇక ఇంత కాలం గ్యాప్‌ తీసుకున్న ఆమె ఎట్టకేలకు ఓ తెలుగు స్ట్రయిట్ చిత్రంలో నటించడం విశేషం. ఈ చిత్రమే సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'సమ్మోహనం'. ఈ చిత్రం తాజాగా విడుదలై మంచి హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది. సినిమా చాలా బాగుందని చూసిన అందరు పాజిటివ్‌గా చెబుతున్నారు. ఈ పాజిటివ్‌ టాక్‌లో అదితి పాత్ర కూడా ఎంతో ఉందనే విషయాన్ని సినీ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో 'సమీరా' పాత్రను చేసిన అదితిరావు హైదరి ఎంతో అందంతో పాటు టాలెంట్‌తో కూడా మెప్పించిందన్న ప్రశంసలు లభించాయి. 

ఇందులో ఆమె స్టార్‌ హీరోయిన్‌ పాత్రను చేసింది. ఆమెని చూసినంత సేపు నిజమైన సినిమా హీరోయిన్‌ని చూసినట్లుగానే అనిపించిందని విశ్లేషకులు కూడా కితాబునిస్తున్నారు. ఇక ఈ చిత్రం సుధీర్‌బాబు కెరీర్‌లో మరో హిట్‌ తేవడం గ్యారంటీ అంటున్నారు. మొత్తానికి అదితిరావు హైదరికి ఈ చిత్రం ద్వారా మరిన్ని అవకాశాలు లభించడం ఖాయమని, త్వరలో ఆమె టాప్‌ హీరోయిన్‌ అవుతుందని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Aditi Rao Hydari got Hit with Sammohanam movie:

Aditi Rao Hydari gets best compliments with Sammohanam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ