రామ్ చరణ్ ఫైట్ చేస్తున్నాడు..!
Ram Charan and Boyapati Film Latest Updateరామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ ఇందులో చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ సెట్ వేసి అక్కడ గత మూడువారాలపాటు నుండి ఫైట్ సీన్స్‌కి సంబంధించి షూటింగ్ జరుపుతున్నారు. చరణ్ పై భారీ లెవెల్ లో యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇంటర్వెల్ ముందు.. అలానే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్స్ లకు సంబంధించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ అని యూనిట్ చెబుతున్నమాట.
ఈ రెండు ఫైట్స్ సినిమాలో హైలైట్ అవుతాయి అని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత విదేశాలు వెళ్లనున్నారు. అక్కడ కొన్ని సాంగ్స్ ను చిత్రీకరించనున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో వివేక్‌ఒబెరాయ్, తమిళ్ సీనియర్ హీరో ప్రశాంత్, స్నేహాలు కీలకపాత్రలలో నటిస్తున్నారు. దసరా టైంకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.
Charan and Boyapati film in Action part Shooting






































