Advertisementt

కళ్యాణ్ పై సుధీర్ దే పై చేయి..!

Sun 17th Jun 2018 11:37 AM
naa nuvve,sammohanam,  కళ్యాణ్ పై సుధీర్ దే పై చేయి..!
Box Office Result: Sammohanam and Naa Nuvve కళ్యాణ్ పై సుధీర్ దే పై చేయి..!
Advertisement
Ads by CJ

ఈ వారం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ సపోర్ట్ తో 'నా నువ్వే' అంటూ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ 'నా నువ్వే' ని ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా తిరస్కరించారు. కళ్యాణ్ రామ్ పదేళ్ల క్రితం చెయ్యాల్సిన సినిమాని ఇప్పుడు చేసాడని... అవుట్ డేటెడ్ దర్శకుడిని నమ్ముకుని కళ్యాణ్ రామ్ చేసిన తప్పే మళ్ళీ చేసాడని అన్నారు. ఇక తమన్నా అందాలు కూడా సినిమాని కాపాడలేని పరిస్థితి. ఇక ఇదే వారం అంటే నిన్న శుక్రవారం మహేష్ బాబు బావ సుధీర్ బాబు మహేష్ సపోర్ట్ తో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో.. అదితి రావుతో కలిసి 'సమ్మోహనం' అంటూ థియేటర్స్ లో దిగిపోయాడు. అయితే సుధీర్ బాబు 'సమ్మోహనం' అందరిని సమ్మోహన పరిచేసింది. క్లాస్ ప్రేక్షకులకు నచ్చే సినిమానే అయినా... క్రిటిక్స్ నుండి ప్రేక్షకుల నుండి కూడా సమ్మోహనం మంచి మార్కులే వేయించుకుంది.

సుధీర్ బాబు సమ్మోహనం సినిమాలో బాగా నటించాడని... మంచి బాడీ బిల్డింగ్ తో  ఇరగదీశాడని... ఇంకా అదితిరావు కూడా ఈ సినిమా విజయంలో పాలు పంచుకుందని... అదితి అందాలు, సీనియర్ నరేష్ కామెడీ సమ్మోహనం మెయిన్ హైలెట్ గా ప్రేక్షకులు సమ్మోహనం సినిమాకి పాజిటివ్ టాక్ ఇచ్చేసారు. భలే మంచి రోజు, శమంతకమణి తో ఓ మాదిరి విజయాలను సొంతం చేసుకున్న సుధీర్ బాబు కి ఈ సినిమా హిట్ ఊరటనిచ్చింది. గత వారం రోజులనుండి థియేటర్ లలో మంచి సినిమాలు లేక బోర్ ఫీల్ అవుతున్న ప్రేక్షకులకు సమ్మోహనం సినిమా కాస్త ఊరటనిచ్చింది.

'కాలా' సినిమా కూడా ప్రేక్షకులు కొత్త సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది. ఇక మంచి టైం లో కళ్యాణ్ రామ్ తో పోటీకి సై అన్న సుధీర్ బాబు ఈ పోటీలో పై చెయ్యి సాధించాడు. నా నువ్వే ని ప్రేక్షకులు రిజెక్ట్ చేసి.. సమ్మోహనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్ లో సమ్మోహనంతో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాడు. సుధీర్ బాబు విజయాన్ని సాధించడానికి మెయిన్ కారణం దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇంద్రగంటి తన సినిమాల్లో కథ కథనం అన్ని బలంగా ఉండేలా చూసుకుంటాడు. అష్టాచెమ్మా, జెంటిల్మెన్, అమీ తుమీ ఇలా అన్ని సినిమాల్లోనూ ఇంద్రగంటి మార్క్ కనబడినట్లే ... సమ్మోహనం లోను ఇంద్రగంటి మార్క్ స్పష్టంగా కనబడుతుంది.

Box Office Result: Sammohanam and Naa Nuvve:

Naa Nuvve vs Sammohanam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ