అఖిల్ 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన కల్యాణి ప్రియదర్శన్.. సినిమా అనుకున్నంత విజయం సాధించక పోయినా ఆమె నటన పరంగా.. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఆమెకు తెలుగులో బాగానే అవకాశాలు వస్తున్నాయి. సుధీర్ వర్మ డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా మూవీలో ఛాన్స్ కొట్టేసింది.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె మెగా హీరోతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని తాజా సమాచారం.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు హిట్ అయితే, మరిన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఆమె తమిళంలో కూడా చేస్తునట్టు టాక్.