Advertisementt

రౌడీని కాదంటూ క్లారిటీ ఇచ్చాడు..!

Sat 16th Jun 2018 01:19 PM
raj tarun,telugu remake,naanum rowdy dhaan  రౌడీని కాదంటూ క్లారిటీ ఇచ్చాడు..!
Raj Tarun Refutes Remake Rumours రౌడీని కాదంటూ క్లారిటీ ఇచ్చాడు..!
Advertisement
Ads by CJ

'ఉయ్యాలజంపాల, కుమారి 21 ఎఫ్‌, సినిమా చూపిస్త మావా, ఈడోరకం ఆడోరకం' వంటి చిత్రాల తర్వాత హీరో రాజ్‌తరుణ్‌ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం', తాజాగా వచ్చిన 'రాజుగాడు' వంటి చిత్రాలన్ని ఫ్లాప్‌ అయ్యాయి. ఈ సమయంలో ఈయన విషయంలో ఓ వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. తమిళంలో నయనతార, శివకార్తికేయన్‌ జంటగా, విఘ్నేష్‌శివన్‌ దర్శత్వంలో వచ్చిన 'నేనుం రౌడీ దాన్‌'ని ఆల్‌రెడీ తెలుగులో కూడా 'నేను రౌడీనే'గా డబ్‌ అయింది. 

ఈ చిత్రాన్ని మరలా రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్‌లతో కలిసి సి.కళ్యాణ్‌ రీమేక్‌ చేస్తున్నాడని వార్తలు రావడంతో ఇక ఈ యంగ్‌ హీరో పని అయిపోయినట్లేనని, సినిమాల సెలక్షన్‌ బాగా లేదని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. నేను 'నేనుం రౌడీదాన్‌' చిత్రం రీమేక్‌ చేయడం లేదని, నా తదుపరి చిత్రానికి ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జురుగుతున్నాయని తెలిపాడు. 

నటీనటులను, ఇతర సాంకేతిక నిపుణులను త్వరలోనే అఫీషియల్‌గా తెలుపుతామని తేల్చిచెప్పాడు. దాంతో రాజ్‌తరుణ్‌ 'నేనుం రౌడీదాన్‌' రీమేక్‌లో నటించడం లేదని తెలిసి ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

Raj Tarun Refutes Remake Rumours:

Raj Tarun About Telugu Remake Naanum Rowdy Dhaan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ