Advertisementt

డ్యాన్సింగ్‌ అంకుల్‌ జోరు మామూలుగా లేదు!

Sat 16th Jun 2018 01:03 PM
dancing uncle,sanjeev shrivastava,govinda,madhuri dixit  డ్యాన్సింగ్‌ అంకుల్‌ జోరు మామూలుగా లేదు!
Finally Dancing Uncle Met His Favourite Actor డ్యాన్సింగ్‌ అంకుల్‌ జోరు మామూలుగా లేదు!
Advertisement
Ads by CJ

ఈరోజుల్లో ఏదైనా వెరైటీగా అనిపిస్తే అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రియా వారియర్‌ వరకు ఇందుకు ఎందరో ఉదాహరణగా ఉన్నారు. ఇక మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కి చెందిన ప్రొఫెసర్‌ సంజీవ్‌శ్రీవాస్తవ్‌ విషయంలో ఇదే జరుగుతోంది. ఓ పెళ్లి వేడుకలో స్టేజీ మీద ఆయన తన అభిమాని అయిన హీరో గోవిందా స్టెప్పులను వేసిన వీడియో వైరల్‌గా మారి, ఆయన్ను ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ని చేసింది. 1987లో వచ్చిన హిందీ చిత్రం ఖుద్‌గర్జ్‌ చిత్రంలోని 'ఆప్‌ కే ఆ జానెసే' పాటని ఆయన ఏదో డ్యాన్స్‌ చేయాలి అన్నట్లుగా కృత్రిమంగా చేయకుండా లీనమైపోయి డ్యాన్స్‌ చేశాడు. 

దాంతో పలువురు సినీ సెలబ్రిటీలకు కూడా ఆయన ఫేవరేట్‌ అయిపోయాడు. ఇటీవలే డ్యాన్స్‌ అంకుల్‌ సల్మాన్‌ఖాన్‌ని కలిశాడు. సోనీ టీవీలో సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా వస్తోన్న 'దస్‌ కా దమ్‌' లో ఆయన పాల్గొన్నాడు. ఇక సునీల్‌శెట్టి అయితే ఆయనకు నటునిగా చాన్స్‌ ఇస్తానని ప్రామిస్‌ చేశాడు. ఇక విషయానికి వస్తే తాజాగా ఈయనను ఈయన ఫేవరేట్‌ హీరో గోవిందా కూడా కలిశాడు. కలవడమే కాదు.. ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. తమ ఇద్దరితో పాటు మాధురి దీక్షిత్‌ని కూడా ఆ డ్యాన్స్‌లో భాగస్వామిని చేశాడు గోవిందా. డ్యాన్స్‌ దివానే షో దీనికి వేదికగా నిలిచింది. 

ఇక విదిషకి చెందిన ఈ ప్రొఫెసర్‌ డ్యాన్స్‌ని చూసి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మెచ్చుకోవడమే కాదు.. విదిష మున్సిపల్‌ కార్పొరేషన్‌కి ఆయనను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఆల్‌రెడీ ఈయనతో బజాజ్‌ కంపెనీ ఓ యాడ్‌ని కూడా షూట్‌ చేసిన విషయం తెలిసిందే. 

Finally Dancing Uncle Met His Favourite Actor:

Dancing Uncle Sanjeev Shrivastava finally meets his idol Govinda. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ