త్రివిక్రమ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న 'అరవింద సమేత - వీర రాఘవ' సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ అరవింద సమేతని భారీ అంగులతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో అదరగొట్టేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన అరవింద సమేత వీర రాఘవ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ కి విపరీతమైన స్పందిన వచ్చింది. రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి బాగా టైం తీసుకున్న త్రివిక్రమ్.. షూటింగ్ మొదలెట్టినప్పటి నుండి ఇప్పటివరకు అరవింద సమేత షూటింగ్ ని ఆఘమేఘాల మీద చిత్రీకరిస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కాంబో సెట్ అయ్యి సినిమా ఓపెనింగ్ చేసుకున్న రోజునే వీరి సినిమా దసరా టార్గెట్ పెట్టుకుందనేది తెలిసిన విషయమే. అందుకే అటు ఎన్టీఆర్ ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ కొద్దిగా విరామం కూడా తీసుకోకుండా అరవింద సమేత షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారు. అయితే దసరాకి విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్ పక్కాగా డేట్ అయితే ఇవ్వలేదు. తాజాగా ఎన్టీఆర్ అరవింద సమేతని దసరా కానుకగా అక్టోబర్ పదో తేదీన విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. ఎలాగూ అక్టోబర్ ఎనిమిది నుండి దసరా సెలవలు మొదలవడంతో... అక్టోబర్ పదిన సినిమాని విడుదల చేస్తే దసరా సెలవలని బాగా క్యాష్ చేసుకోవచ్చని చినబాబు భావిస్తున్నాడట.
మరి మొదటగా దసరాకి డేట్ ఫిక్స్ చేసుకుంది ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ సినిమానే. ఇక గత దసరాకి జై లవ కుశ తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఈ దసరాకి అరవింద సమేతతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇక అరవింద సమేత లో అరవింద గా డీజే భామ పూజ హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.