గత రెండు రోజులుగా మహేష్ బాబు బాలీవుడ్ లో మూవీ చెయ్యబోతున్నాడంటూ రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందుకే మొన్నీమధ్యనే మహేష్ ముంబై వెళ్లాడని.. అంటున్నారు. నిజంగానే మహేష్ బాబు ముంబయి ఎయిర్ పోర్ట్ లో కనబడేసరికి మహేష్ బాలీవుడ్ న్యూస్ మరింతగా పాకింది. మరోపక్క స్పైడర్ దర్శకుడు మురుగదాస్ స్పైడర్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తానని తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పడంతో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ వార్తలకు మరింత బలం చేకూరాయి.
మహేష్ బాలీవుడ్ కి వెళుతున్నాడు అనే న్యూస్ మాత్రం కేవలం రూమర్. మురుగదాస్ స్పైడర్ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తానని చెప్పాడు కానీ ఎక్కడా మహేష్ తోనే స్పైడర్ రీమేక్ బాలీవుడ్ లో ఉంటుందని చెప్పలేదు. అలాగే మహేష్ ముంబై వెళ్ళింది కూడా సినిమా కోసం కాదు. మహేష్ బాబు ప్రస్తుతం వంశి దర్శకత్వంలో తెరకెక్కబోయే మహేష్ 25 వ మూవీ కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. అందుకోసం మహేష్ వైఫ్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటోంది. అయితే మహేష్ ప్రస్తుతం న్యూ లుక్ కోసం స్పెషల్ గా బాలీవుడ్ ట్రైనర్ ... బాలీవుడ్ స్టైలిస్ట్ హెల్ప్ తీసుకుంటున్నాడట.
తాను గెడ్డం పెంచి... పాపిడి పక్కకు తీసుకుని ప్రస్తుతం మహేష్ కనిపిస్తున్న న్యూ లుక్ ఇంకా ఫైనల్ కాలేదట. మహేష్ ఇంకా 25 వ మూవీ కోసం ఫుల్ గా మేకోవర్ అయ్యాకే స్పెషల్ గా ఫోటో షూట్ చేసి లుక్ ఫైనల్ చేస్తారట. అయితే మహేష్ మాత్రం బాలీవుడ్ స్టైలిస్ట్ హెల్ప్ కోసమే ముంబై వెళ్ళాడు కానీ.... మహేష్ ముంబై వెళ్ళింది బాలీవుడ్ ఎంట్రీ కోసం కాదట. అదండీ సంగతి మహేష్ బాబు మేకోవర్ కోసమే ముంబై వెళ్ళాడు కానీ... ముంబై పర్యటనలో మరో ఉద్దేశ్యం లేదనేది వాస్తవం.