బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నటించిన 'రేస్' ప్రజల ముందుకు వస్తోంది. ఇక గతంలో రాజస్థాన్‌లోని గిరిజన ప్రజలు దైవంగా చూసుకునే కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ నిందితుడే కాదు.. దోషిగా కూడా తేలాడు. దీంతో సల్మాన్‌ఖాన్‌పై ఆ గిరిజన తండాలకు చెందిన బిష్నేయ్ గ్యాంగ్ సల్మాన్‌ఖాన్‌ని చంపుతామని హెచ్చరిస్తూ వస్తోంది. దీంతో సల్మాన్‌కి ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు సల్మాన్‌ని చంపడానికి రెడీ అయ్యామని సంపత్ నెహ్రా అనే గ్యాంగ్‌స్టర్ వెల్లడించడంతో భద్రతను పెంచారు.
ఇప్పటికీ ఈయన సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించాడట. ఈ విషయాన్ని హర్యానాకి చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ముంబై పోలీసులకు సమాచారం అందించారు. సంపత్ నెహ్రాను హైదరాబాద్‌లోని మియాపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో రోజు రోజుకి ఇలాంటి బెదిరింపులు, హత్యలు చేయడానికి రెక్కీలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని హతమార్చేందుకు కూడా పూణెలో కుట్ర జరిగిన సంగతి తెలిసిందే. రాజీవ్‌గాంధీ హత్య తరహాలో మోదీని హతమార్చాలని ఓ గ్యాంగ్ కుట్ర చేసింది. ఇక దేశంలో ఎక్కడ ఏది జరిగినా దాని ఆనవాలు హైదరాబాద్‌లో లభిస్తుండటం గమనార్హం. మరి ఈ విషయంలో హైదరాబాద్‌ని తీవ్రవాదులు, నక్సలైట్ల నుంచి మాఫియా వరకు సేఫ్టీ జోన్‌గా భావిస్తున్నాయి.
మరి దీనిని ఆనవాళ్లతో సహా పెకిలించి వేయాల్సిన గురుతర బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖలపై ఉన్నాయి. ఇక సల్మాన్ కేసుల్లో అరెస్టయిన సంపత్ నెహ్రా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగులో షార్ప్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సల్మాన్‌ని చంపేస్తామని బిష్నోయ్ గ్యాంగ్ జనవరి నుంచి వరుసగా హెచ్చరికలు జారీ చేస్తోంది.